ఈ నెల 23న కార్తికేయ2 మళ్లీ విడుదలవుతోంది..

కార్తికేయ2 .. ఊహించని విధంగా బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమా. ఫస్ట్ పార్ట్ 2014లో వచ్చింది. దానికి కంటిన్యూటీ అని చెప్పలేం కానీ.. అందులోని హీరో పాత్రను కొనసాగించారు. అందువల్ల ఇది సీక్వెల్ అనొచ్చు. ఫస్ట్ పార్ట్ లో ఎక్కువ ట్విస్ట్ లు ఉన్నాయి. ఇందులో అన్ని కనిపించకపోయినా.. కథనం ఆకట్టుకుంది. హీరో పాత్రతో పాటు దాని చుట్టూ అల్లిన ద్వారకలోని శ్రీ కృష్ణుడి ఎపిసోడ్ ఇప్పుడు దేశం ఉన్న మూడ్ కు పర్ఫెక్ట్ గా సింక్ కావడంతో లాజిక్స్ ను కూడా పట్టించుకోకుండా సినిమాను అందలం ఎక్కించారు. దీంతో తెలుగుతో పాటు హిందీలో కలిపి ఏకంగా వంద కోట్లు కొల్లగొట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది.

నిఖిల్ కు హిందీ బెల్ట్ లోనూ మంచి మార్కెట్ ను క్రియేట్ చేసింది కార్తికేయ2. అలాంటి సినిమా మరోసారి విడుదల కావడం ఏంటా అనే డౌట్ రావొచ్చు. అయితే మొదట వీరు తెలుగు సినిమాగానే విడుదల చేయాలనుకున్నారు. తర్వాత హిందీలో చాలా తక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేశారు. మౌత్ టాక్ తో రెండు వందల థియేటర్స్ వరకూ వెళ్లిందీ సినిమా. దీంతో అక్కడే ఏకంగా 29కోట్ల గ్రాస్ రాబట్టింది.ఇక నిఖిల్ సరసన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ నటించింది. అయితే ఇది రెగ్యులర్ హీరోయిన్ టైప్ రోల్ కాదు.కథనం మధ్యలో కలిసే పాత్ర.

అక్కడి నుంచి హీరోకు అన్ని విధాలుగా సాయం చేస్తూ ఆఖరి వరకూ తోడుంటుంది. అనుపమ నటనకూ మంచి మార్కులే పడ్డాయి. అందుకే తన భాషలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. యస్.. కార్తికేయ2ను మళయాలంలోనూ విడుదల చేయబోతున్నారు. ఈ నెల 23 నుంచి ఈ చిత్రం అక్కడి థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఈ విషయాన్ని అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు. మరి కాస్త ప్రోగ్రెసివ్ గా కనిపించే కేరళీయులు ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Related Posts