వ‌య‌సు 50 దాటినా.. పెళ్లి వ‌ద్దే వ‌ద్దంటున్న భామ‌లు

ఒక్కొక్క‌రికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. కొంత మంది కుటుంబానికి ప్రాధాన్య‌త ఇస్తారు. కొంత మంది కెరీర్ కి. ఇంకా కొంత మంది డ‌బ్బుకి. ఇలా ప్ర‌తి మ‌నిషి కొన్ని విష‌యాల‌ను ప‌ట్టించుకుంటారు.. కొన్ని విష‌యాల‌ను వ‌దిలేస్తారు. ఈ అభిప్రాయాలు ఉండ‌డానికి ముఖ్య కార‌ణం గ‌తంలో వాళ్లు ఎదుర్కొన్న సంఘ‌ట‌న‌లు కావ‌చ్చు. అయితే… ఇండ‌స్ట్రీలో చాలా మంది న‌ల‌భై, యాభై ఏళ్లు దాటినా కూడా వాళ్ల వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల‌న కెరీర్ కి ప్రాధాన్య‌త ఇచ్చి పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. వాళ్ల‌ల్లో కొంత మంది గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు క‌థానాయిక‌ ట‌బు. తెలుగులో మాత్ర‌మే కాకుండా హిందీలో కూడా ఎన్నో హిట్ చిత్రాల్లో న‌టించారు కానీ.. ఇన్ని సంవ‌త్స‌రాలు అయినా కూడా త‌న వ్య‌క్తిగ‌తానికి సంబంధించిన విష‌యాలు బ‌య‌ట‌కు రావు. ఇప్ప‌టి వ‌ర‌కు పెళ్లి చేసుకోలేదు. సింగిల్ గానే ఉన్నారు. ట‌బు ఈ విష‌యాల గురించి బ‌య‌ట ఎక్కువుగా మాట్లాడ‌రు. ఆమె సినిమాల్లోనే కాకుండా ఎన్నో సీరియ‌ల్స్ లో కూడా న‌టించారు. ఇక సితార.. సినిమాల్లోనే కాకుండా ఎన్నో సీరియ‌ల్స్ లో కూడా న‌టించారు.

సితార త‌న పెళ్లి గురించి మీడియాతో మాట్లాడుతూ… తను త‌న తండ్రికి చాలా క్లోజ్ అని.. త‌ల్లిదండ్రుల‌ను వ‌దిలి వెళ్ల‌డం ఇష్టం లేక పెళ్లి చేసుకోలేద‌ని చెప్పారు. తండ్రి చ‌నిపోయిన త‌ర్వాత పెళ్లి ఆలోచ‌నే పూర్తిగా పోయింద‌న్నారు. మ‌ల‌యాళం సినిమాల‌తో పాటు తెలుగులో శంక‌ర్ దాదా ఎంబిబిఎస్, క‌లిసుందాం రా, అధిప‌తి, సీమ‌సింహం, అలాగే క‌న్న‌డ సినిమాల్లో న‌టించారు సీనియర్ న‌టి నిర్మల‌. ఈమె కూడా పెళ్లి చేసుకోలేదు.

న‌ర్గీస్ ఫ‌క్రీ 2011లో వ‌చ్చిన రాక్ స్టార్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఈమె ఎక్కువుగా హిందీ చిత్రాల్లోనే న‌టించారు. తెలుగులో సూప‌ర్ స‌క్స‌స్ సాధించిన జులాయి సినిమా త‌మిళ్ ప్ర‌శాంత్ హీరోగా రీమేక్ అయ్యింది. ఈ సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్ చేశారు న‌ర్గీస్ ఫ‌క్రీ. ఈమె పెళ్లంటే నో అంటుంటారు. ఇక మ‌న‌కు బాగా తెలిసిన వ్య‌క్తి సుస్మితా సేన్. ఇప్ప‌టి వ‌ర‌కు సుస్మిత‌సేన్ పెళ్లి చేసుకోలేదు. హిందీలోనే కాకుండా తెలుగులో కూడా న‌టించారు. ఈమె పెళ్లి చేసుకోకుండానే పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకోవ‌డం విశేషం. ఇక బ‌ద్రి, నాని, న‌ర‌సింహుడు చిత్రాల్లో న‌టించిన క‌థానాయిక అమీషా ప‌టేల్. ఆమె రిలేష‌న్ షిప్ గురించి వార్త‌లు వ‌స్తూ ఉంటాయి.

అయితే.. ఆమె దేనికి ఎక్కువుగా స్పందించ‌దు. ఇక తెలుగులో టాప్ హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించిన న‌గ్మా ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో బిజీగా ఉన్నారు. న‌గ్మా కూడా త‌న పెళ్లి గురించి ఎక్కువుగా రియాక్ట్ అవ్వ‌రు. ఇక 1952లోనే కెరీర్ మొద‌లుపెట్టిన ఆశా ఫార‌క్ ఎన్నో సినిమాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే అవార్డులు కూడా గెలుచుకున్నారు. ఈమె కూడా పెళ్లి చేసుకోలేదు. అలాగే శోభ‌న్ ఆమ‌ధ్య పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త‌లు వినిపించాయి కానీ.. ఓ ఇంట‌ర్ వ్యూలో వ్య‌క్తిగ‌త విష‌యాల గురించి మాట్లాడ‌న‌ని చెప్పారు. అయితే.. సింగిల్ గా చాలా సంతోషంగా ఉన్నాను అన్నారు. అలాగే క‌థానాయిక కౌస‌ల్య కూడా ఇప్ప‌టి వ‌ర‌కు పెళ్లి చేసుకోలేదు.

Related Posts