అంద‌రికీ వరాలు ఇస్తున్నారు. సినిమా వాళ్ల‌కి హెల్ప్ చేయండి – బ్ర‌హ్మాజీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అన్ని సినిమాల‌కు ఒకేలా టిక్కెట్టు రేట్లు ఉండాల‌ని ప్ర‌భుత్వం జీవో తీసుకురావ‌డం.. భారీ చిత్రాల‌కు టిక్కెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు ఇవ్వాల‌ని నిర్మాత‌లు ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేయ‌డం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం నుంచి సానున‌కూలంగా స్పంద‌న రాక‌పోవ‌డంతో థియేట‌ర్ల ఓన‌ర్స్ కోర్టును ఆశ్ర‌యించారు. కోర్టు పెద్ద సినిమాల‌కు టిక్కెట్ల రేట్లు పెంచునేలా ఆదేశాలు ఇవ్వ‌డం జ‌రిగింది.

కోర్టు ఆదేశాల‌తో నిర్మాత‌లకు కాస్త ఊర‌ట ల‌భించింది అనుకుంటే.. థియేట‌ర్ల ఓన‌ర్స్ ప్ర‌మాణాలు పాటిస్తున్నారా..? లేదా..? అని త‌నిఖీలు చేస్తూ.. ఏమాత్రం స‌రిగా లేక‌పోయినా థియేట‌ర్ల‌ను సీజ్ చేస్తున్నారు. ఇలా సినిమా ఇండ‌స్ట్రీని టార్గెట్ చేయ‌డం వివాద‌స్పం అవుతుంది. ఇంత జ‌రుగుతున్న‌ప్ప‌టికీ సినీ పెద్ద‌లు ఏమాత్రం స్పందించ‌డం లేదు. అయితే.. సీనియ‌ర్ యాక్ట‌ర్ బ్ర‌హ్మాజీ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ.. వై.ఎస్. జ‌గ‌న్ సార్.. అంద‌రికీ వ‌రాలు ఇస్తున్నారు. పాపం థియేట‌ర్స్ ఓన‌ర్స్ కి, సినిమా వాళ్ల‌కి హెల్ప్ చేయండి. ఇట్లు మీ నాన్న గారి అభిమాని అని పోస్ట్ పెట్టారు.

ఈ పోస్ట్ లో తెలంగాణ‌లో థియేట‌ర్స్ ద‌గ్గ‌ర వెహిక‌ల్ పార్కింగ్ రేటు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సినిమా టిక్కెట్ రేటును తెలిపేలా పోటోలు పెట్ట‌డం జ‌రిగింది. తెలంగాణ‌లోని థియేట‌ర్స్ ద‌గ్గ‌ర కారు పార్కింగ్ రేటు 30 రూపాయిలు అయితే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో బాల్క‌ని 20, ప‌స్ట్ క్లాస్ 15, సెకండ్ క్లాస్ 10 రూపాయ‌లు. ఈ రేట్ల‌తో నిర్మాత‌ల‌కు భారీగా న‌ష్టం వ‌స్తుంది. రోజురోజుకు ఈ వివాదం ముదురుతుంది. మ‌రి.. ఈ వివాదం ఎంత వ‌ర‌కు వెళుతుందో.. ఎప్పుడు ఎండ్ అవుతుందో అనేది ఆస‌క్తిగా మారింది.

Related Posts