ఎస్సెన్స్ ఆఫ్ ‘తండేల్‘.. ప్రియుడు కోసం సముద్రపు ఒడ్డున సాయిపల్లవి

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘తండేల్‘. ‘కార్తికేయ 2‘తో ఇప్పటికే పాన్ ఇండియా హిట్ అందుకున్న చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రతిష్ఠాత్మక సంస్థ గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఈ సినిమాలో నాగచైతన్యకి జోడీగా నేచురల్ బ్యూటీ సాయిపల్లవి నటిస్తుంది.

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ లో పాజిటివ్ వైబ్స్ తో ప్రారంభమైన ‘తండేల్‘.. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. పట్టాలెక్కి కొన్ని రోజులే అయినా.. అప్పుడే ప్రచార పర్వాన్ని మొదలుపెట్టింది టీమ్. ఈ సినిమా నుంచి ‘ఎస్సెన్స్ ఆఫ్ తండేల్‘ పేరుతో ఓ స్పెషల్ టీజర్ జనవరి 5న రాబోతుంది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి సాయిపల్లవి పాత్రను పరిచయం చేస్తూ చిన్న మోషన్ గ్లింప్స్ రిలీజ్ చేసింది టీమ్. సత్య పాత్రలో సాయిపల్లవి ప్రియుడు కోసం సముద్రం ఒడ్డున కూర్చుని ఎదురుచూస్తున్న స్టిల్ ఇది. ఈ సినిమాలో మత్స్య కారుడిగా కనిపించబోతున్నాడు నాగచైతన్య.

Related Posts