‘నా సామిరంగ‘ గ్లింప్స్.. రాజ్ తరుణ్ కోసం సెపరేట్ లవ్ ట్రాక్

కింగ్ నాగార్జున ‘నా సామిరంగ‘ సంక్రాంతి బరిలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఇతర కీలక పాత్రల్లో అలరించబోతున్నారు. ఆమధ్య ఈ మూవీ నుంచి అల్లరి నరేష్ పోషిస్తున్న అంజి పాత్రను పరిచయం చేస్తూ ఓ స్పెషల్ గ్లింప్స్ రిలీజయ్యింది. లేటెస్ట్ గా రాజ్ తరుణ్ క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ మరో స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసింది టీమ్.

ఈ సినిమాలో రాజ్ తరుణ్ భాస్కర్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ‘మా భాస్కర్ ప్రేమ కథని పరిచయం చేస్తున్నాం.‘ అంటూ రాజ్ తరుణ్ క్యారెక్టర్ ను పరిచయం చేశారు మేకర్స్. రుక్సార్ థిల్లాన్ కుమారి పాత్రలో కనిపించబోతుంది. 1980ల నాటి వీరిద్దరి ప్రేమాయణంతో ఈ స్పెషల్ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. అలాగే.. ఈ మూవీ నుంచి నెక్స్ట్ సింగిల్ కమింగ్ సూన్ అంటూ ఈ గ్లింప్స్ లో ‘నా సామిరంగ‘ కొత్త పాటపై కూడా అప్డేట్ అందించారు.

Related Posts