ఇంట్ర‌స్టింగ్ లుక్ లో ధ‌నుష్‌..”సార్” షూటింగ్ స్టార్ట్

విభిన్న క‌థా చిత్రాల‌ను ఎంచుకుంటూ.. విజ‌య‌లు సాధిస్తూ.. మోస్ట్ టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్‌. ఇప్ప‌టి వ‌ర‌కు ధ‌నుష్ త‌మిళ్, హిందీ, ఇంగ్లీషు సినిమాల్లో న‌టించారు. ఫ‌స్ట్ టైమ్ తెలుగులో ధ‌నుష్ సినిమా చేస్తున్నాడు. దీనికి యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో సార్.. త‌మిళ్ లో వాతి టైటిల్ తో రూపొందిస్తున్నారు.

అయితే.. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ని మేకర్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు. ఈ విష‌యాన్ని అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేసి వ‌ర్కింగ్ స్టిల్ రిలీజ్ చేశారు. దీనిలో ధనుష్ లుక్ మాత్రం చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంది. ఒక కాలేజ్ స్టూడెంట్ డ్రెస్సింగ్ లో ధ‌నుష్ క‌నిపించారు. ఏ పాత్ర చేసినా ఆ పాత్ర‌లో దొరేస్తాడు ధ‌నుష్. ఈ సినిమాలో కూడా త‌న క్యారెక్ట‌ర్ లో ప‌లు వేరియేష‌న్స్ చూపించ‌నున్న‌ట్టుగా అర్ధం అవుతుంది.

Image

ఈ సినిమాకి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తుండగా.. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని ఏమాత్రం రాజీప‌డ‌కుండా మంచి క్వాలిటీతో నిర్మిస్తున్నారు. మ‌రి.. ఈ సినిమాతో ధ‌నుష్ తెలుగులో ఏ స్ధాయి విజ‌యాన్ని సాధిస్తాడ‌నేది ఆస‌క్తిగా మారింది.

Related Posts