‘సరిపోదా శనివారం’ గ్లిమ్స్ కి కౌంట్ డౌన్ షురూ

తెలుగు చిత్ర పరిశ్రమలో చక్రం తిప్పుతోన్న స్టార్ హీరోలంతా దాదాపు వారసత్వంగా ఇండస్ట్రీకి వచ్చినవారే. ఇక.. వారసత్వం లేకుండానూ తెలుగు చిత్ర పరిశ్రమలో సత్తా చాటుతున్నవారూ ఉన్నారు. అలాంటి వారిలో నేచురల్ స్టార్ నాని ముందు వరుసలో నిలుస్తాడు. తన కాంటెంపరరీస్ లో మిగతా హీరోలకు సాధ్యం కాని రీతిలో జెట్ స్పీడులో సినిమాలు చేస్తుంటాడు నాని.

‘దసరా, హాయ్ నాన్న‘ వంటి వరుస విజయాల తర్వాత ఇప్పుడు ‘సరిపోదా శనివారం‘తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. ‘అంటే.. సుందరానికి‘ సినిమాతో ఇప్పటికే నానికి మంచి ఫీల్ గుడ్ మూవీ అందించిన వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘ఆర్.ఆర్.ఆర్‘ వంటి గ్లోబల్ మూవీ తర్వాత డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ నుంచి వస్తోన్న చిత్రాలలో ‘సరిపోదా శనివారం‘ ఒకటి.

నాని ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో అన్ని ఎలిమెంట్స్ ఉన్నా.. యాక్షన్ పాళ్లు కాస్త తక్కువే. అయితే.. ‘సరిపోదా శనివారం’లో యాక్షన్ సీక్వెన్సెస్ కి ఎక్కువ ప్రాధాన్యాత ఇస్తున్నారట. హీరో నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన గత చిత్రం ‘అంటే.. సుందరానికి’తో పూర్తి స్థాయి వినోదాన్ని పంచింది. ఈసారి ‘సరిపోదా శనివారం’ సినిమాతో వినోదంతో పాటు.. యాక్షన్ ట్రీట్ కూడా అందించబోతున్నారట. ఫిబ్రవరి 24న శనివారం నాని పుట్టినరోజు సందర్భంగా ‘సరిపోదా శనివారం’ నుంచి స్పెషల్ యాక్షన్ గ్లిమ్స్ రాబోతుంది. సూర్య అన్ ప్యారలల్డ్ మాస్ స్వాగ్ తో ‘సరిపోదా శనివారం‘ గ్లిమ్స్ అదరగొట్టబోతుందటూ హింట్ ఇస్తూ.. ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. దీన్ని బట్టి ఈ చిత్రంలో సూర్య పాత్రలో కనిపించబోతున్నాడు నాని.

Related Posts