చిరంజీవి.. ఒక్క ఎపిసోడ్ తోనే గుడ్ బై ఎందుకంటే

ఎవరెస్టు శిఖరం అంతగా నీవు ఎదిగినా ఒదిగే చిరు జీవి మెగాస్టార్ చిరంజీవి. తెలుగు సినీ వినీలాకాశంలో ఓ ధృవతార. డబ్బు, పేరు, ప్రతిష్టలు అంతకు మించి కీర్తినీ ఇచ్చిన ప్రజలకు ఎన్నో గుప్త దానాలు చేస్తూ రక్తదానం, నేత్ర దానం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మెగాస్టార్ 40 ఏళ్ళ సినీ కెరీర్ లో ఎన్నో రికార్డులను సృష్టించాడు. నటనతో, డ్యాన్స్ తో విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియనివారుండరు. అయితే మెగాస్టార్ చిరంజీవి కేవలం నటుడు మాత్రమే కాదు.. మానవత్వం ఉన్న మనిషి. తన అభిమానులను సేవా కార్యక్రమాల వైపు నడిపిన ఘనత కూడా మెగాస్టార్ చిరంజీవి కే సొంతమని చెప్పవచ్చు..

చెన్నై కు చదువుకోవడం కోసం వెళ్లి.. అక్కడ నటనకు సంబంధించిన కోర్సుని చేశారు చిరంజీవి. కెరీర్ మొదట్లో చిరంజీవి తనకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా నటించారు. అంచె లంచెలుగా.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ దాదాపు 20 ఏళ్ళు పాటు తెలుగు చిత్ర పరిశ్రమను ఏలారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 150కి పైగా చిత్రాలలో హీరోగా నటించారు.

అయితే ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో నటిస్తూ.. బుల్లి తెరపై స్టార్ మా లోని మీలో ఎవరు కోటీశ్వరు షో కి హోస్ట్ గా అడుగు పెట్టారని భావిస్తారు. చిరంజీవి నిజానికి ఓ సీరియల్ లో నటించారని కొంతమందికి మాత్రమే తెలుసు. బాలీవుడ్ లోని ఓ హిందీ సీరియల్ లో చిరంజీవి నటించి బుల్లి తెర ప్రేక్షకులకు కనువిందు చేశారు.

చిరంజీవి అప్పట్లో దూరదర్శన్ లో ప్రసారమయ్యే “రజిని” అనే ధారావాహిక లో గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలో నటించారు. అది కూడా కేవలం ఒక్క ఎపిసోడ్ లో మాత్రమే నటించారు.చిరంజీవి పలు చిత్రాల్లో వరసగా అవకాశం రావడంతో ఒక్క ఎపిసోడ్ తోనే సీరియల్ కు గుడ్ బై చెప్పేసినట్లు తెలుస్తోంది.

Related Posts