స్విట్జర్లాండ్ చెక్కేసిన చరణ్

రెగ్యులర్ షూటింగ్ లతో అలసి పోతున్న మన స్టార్ హీరోలు ఏమాత్రం వీలు దొరికినా విదేశాలకు చెక్కేస్తున్నారు. అక్కడ ప్లెజంట్ వాతావరణంలో సేద తీరుతున్నారు. తాజాగా రామ్ చరణ్ స్విట్జర్లాండ్ లో రిలాక్స్ అవుతున్న ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సోదరితో కలిసి రామ్ చరణ్ స్విస్ టూర్ వెళ్లారు. ఆర్ఆర్ఆర్ రెగ్యులర్ షూటింగ్ తో రామ్ చరణ్ గ్యాప్ లేకుండా వర్క్ చేశారు.

స్విస్ లోని మంచు కొండలపై రామ్ చరణ్ నిల్చున్న ఉన్న ఫొటో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. అక్కడి చలి వాతావరణంలో సన్ రైజ్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు ఉంది చరణ్ ఫొటో. ఇదొక షార్ట్ వెకెషన్ అని, చరణ్ త్వరలోనే రిటర్న్ అవుతారని తెలుస్తోంది.

Related Posts