చక్కనమ్మ చిక్కింది.. సొగసులారబోసింది..

చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు. మరీ జీరో సైజ్ అంటే కష్టం కానీ.. డ్రమ్ నుంచి స్లిమ్ అయితే జిల్ మనిపిస్తారు. ఈ మధ్య వరుసగా విలన్ పాత్రలు చేస్తూ అప్పుడు ఆద్య లాంటి రోల్స్ లో అదరగొడుతూ తెలుగులో ఫుల్ బిజీ అయిపోయిన బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్ మొన్నటి వరకూ కాస్త చబ్బీగానే కనిపించింది. తను చేస్తోన్న పాత్రలకు ఆ ఫిజిక్ పర్ఫెక్ట్ గా సూట్ అయింది.. పైగా తను హీరోయిన్ గా చేయడం లేదు కాబట్టి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అయినా తను సడెన్ గా సన్నబడింది. సన్నజాజి తీగలా మారింది. అనూహ్యంగా తన నుంచి వచ్చిన ఈ చేంజ్ చాలామందిని ఆశ్చర్యపరిచింది. నిజానికి ఇప్పుడు హీరోయిన్లుగా చేస్తోన్న వారిలో చాలామంది చబ్బీగానే ఉన్నారు. ఆ కారణంగానే వారికి టాలెంట్ ఉన్నా కొన్ని పాత్రలు వెళ్లడం లేదు. అయినా వాళ్లెవరూ తమ ఫిజిక్ పై దృష్టి పెట్టడం లేదు. కానీ వరలక్ష్మి మాత్రం అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.

అయితే వరలక్ష్మి లుక్ చూసి చాలామంది తను మళ్లీ హీరోయిన్ గా బిజీ కావాలనుకుంటోందా అని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే మాత్రం తప్పేంటనేది కొందరి వాదన. ఆల్రెడీ తను హీరోయిన్ గా చేసే కదా క్యారెక్టర్ రోల్స్ కు వచ్చింది. ఇప్పుడు చేయడంలో ఆశ్చర్యం ఏముంటుందీ అంటున్నారు. ఏదేమైనా అమ్మడు మాత్రం క్యారెక్టర్స్ కు మల్లిన తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఏ పాత్రైనా తనదైన శైలిలోనే అదరగొడుతూ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా విలన్ రోల్స్ తనకు బాగా సెట్ అవుతున్నాయి కూడా. మరి అలాంటి పాత్రలే కావాలంటే మాత్రం ఈ ఫిజిక్ కొంత మైనస్ గా మారే ప్రమాదం కూడా ఉంది. అయినా మారిందంటే తన మైండ్ లో ఇంకేదో ఉండే ఉంటుందనుకోవచ్చు. మరి అదేంటో టైమే చెబుతుంది.

Related Posts