బ్రహ్మాస్త్ర ఎఫెక్ట్ .. రెండో పార్ట్ డౌటే..

బ్రహ్మాస్త్ర.. భారీ అంచానలతో వచ్చిన బాలీవుడ్ మూవీ. రిలీజ్ కు ముందు ట్రైలర్ చూసినప్పుడే చాలామంది విజువల్ గ్రాండీయర్ అని భావించారు. అనుకున్నట్టుగానే విజువల్స్ తప్ప కంటెంట్ లో స్ట్రెంత్ లేదని తేలింది. దీనికి తోడు బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర అనే హ్యాష్ ట్యాగ్ కూడా సినిమాకు మైనస్ అయింది. ఒకవేళ బలమైన కథ, కథనాలు ఉంటే ఇవేవీ సోదిలో ఉండేవి కాదు. కానీ సినిమాలో దమ్ము లేకపోవడంతో పనీ పాటా లేని వారి మాటలు సినిమాపై ప్రభావం చూపించాయనేది నిజం. అలాగని మరీ తీసి పారేసే సినిమా ఏం కాదు. టైటిల్ పవర్ ఫుల్ గా ఉండటంతో పాటు రాజమౌళి వంటి వారు భుజాలపై మోస్తూ ప్రచారం చేశారు కాబట్టి సౌత్ లో కూడా అంచనాలు పెరిగాయి. వాటిని అందుకోవడంలో ఫెయిల్ అయిందీ టీమ్. సినిమాలు పోవడం కామనే కానీ.. ఇలా పోయిన సినిమాలపై కూడా విషం కక్కడం అనే ట్రెండ్ ఈ మధ్యే మొదలైంది.

ఇవన్నీ కలిపి ఇప్పుడు ఈ సినిమా రెండో భాగం పై ప్రభావం చూపించాయని చెబుతున్నారు. అందుకే బ్రహ్మాస్త్ర – 1 శివ అనే భాగం తర్వాత రావాల్సిన బ్రహ్మాస్త్ర పార్ట్ 2- దేవ్ అనే సినిమా డౌటే అనే డైలాగ్స్ వినిపిస్తున్నాయి. అందుకు కారణం రెండో భాగం రిలీజ్ డేటే. అయితే ఈ డేట్ కు కొంత హానెస్ట్ రీజన్ కూడా కనిపిస్తోంది.బ్రహ్మాస్త్ర పార్ట్ 2- దేవ్ సినిమాను 2025లో విడుదల చేస్తాం అని దర్శకుడు అయాన్ ముఖర్జీ అనౌన్స్ చేశారు. అంటే ఇంకా మూడేళ్లుంది. ఈ మూడేళ్లలో ఏదైనా జరగొచ్చు. అప్పటికి ఇండియన్ సినిమా ఇంకా అడ్వాన్స్ అయిపోవచ్చు. టెక్నికల్ గా ఇంకేవో కొత్త సెటప్స్ రావొచ్చు. దీనివల్ల బడ్జెట్ కూడా పెరుగుతుంది. ఇప్పటికే 350 -400 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఫస్ట్ పార్ట్ ఆ మొత్తం రాబట్టడం కష్టమే అంటున్నారు. అలాంటప్పుడు మళ్లీ సెకండ్ పార్ట్ కు అంత ఖర్చు చేయకపోవచ్చు అనేది ఒక వాదన. లేదూ మూడేళ్ల తర్వాత ఈ సినిమా గురించి ఎవరికీ గుర్తుండదు కాబట్టి ఆ టైమ్ కు రిలీజ్ చేయకపోయినా పెద్దగా పట్టించుకోరు అనే ధైర్యమూ కావొచ్చు.

అయితే ఇవన్నీ స్క్రీన్ కు ఒకవైపు మాత్రమే. మరో వైపు ఇంకో కథనం వినిపిస్తోంది.ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అలియాభట్ ఇప్పుడు ప్రెగ్నెంట్. తను డెలివరీ అయ్యి షూటింగ్స్ కు ప్రిపేర్ కావడానికి ఎంత లేదన్నా మరో యేడాది వరకూ పడుతుంది. అందుకే అప్పటి వరకూ షూటింగ్ ను ఆపేస్తారనీ.. ఆ తర్వాత స్టార్ట్ చేస్తే ఇన్ని విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఉన్నాయి కాబట్టి అంత లేట్ అవుతుందనేది మరో వాదన. ఇవన్నీ ఎలా ఉన్నా.. బ్రహ్మాస్త్ర పార్ట్1 – శివ మాత్రం బాక్సాఫీస్ వద్ద తాండవం చేయలేకపోయిందనేది నిజం. ఆ ఎఫెక్ట్ రెండో భాగంలో వచ్చే దేవ్ పైనా పడుతుంది.

Related Posts