‘భీమా’ ట్రైలర్.. గోపీచంద్ యాక్షన్ కి డివోషనల్ టచ్

మ్యాచో స్టార్ గోపీచంద్ లేటెస్ట్ మూవీ ‘భీమా‘. కన్నడలో పలు విజయవంతమైన సినిమాలు తీసి యాక్షన్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎ.హర్ష ఈ మూవీకి డైరెక్టర్. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె.రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ కి జోడీగా ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ నటిస్తున్నారు. నాజర్, నరేష్, పూర్ణ, వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమా ఎప్పుడు మొదలుపెట్టారో.. ఎప్పుడు పూర్తయ్యిందో తెలియకుండానే ‘భీమా‘ కంప్లీట్ అయ్యింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ రాగా.. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.

పరశురాముడి క్షేత్రం కోసం బ్రహ్మరాక్షసుడి రౌద్రం‘ అంటూ గోపీచంద్ మార్క్ యాక్షన్ కి తోడు.. ఈ చిత్రానికి డోవిషనల్ టచ్ ఇచ్చాడు డైరెక్టర్ హర్ష. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలోనూ.. మరో కొత్త అవతారంలోనూ రెండు విభిన్నమైన షేడ్స్ తో ఈ చిత్రంలో గోపీచంద్ పాత్ర తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. ట్రైలర్ అయితే ఆద్యంతం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. మహాశివరాత్రి కానుకగా మార్చి 8న ‘భీమా’ థియేటర్లలోకి రాబోతుంది. మరి.. మంచి విజయంకోసం ఎదురుచూస్తున్న గోపీచంద్ కి ‘భీమా’ బంపర్ హిట్ అందిస్తుందేమో చూడాలి.

Related Posts