రాక్షసుడైనా, భగవంతుడైనా బింబిసారుడే

బింబిసారుడేకళ్యాణ్‌ రామ్ చాలాకాలంగా షూటింగ్ చేస్తోన్న సినిమా. అతని చివరి సినిమా వచ్చి చాలా రోజులే అవుతుంది. అప్పుడప్పుడూ హిట్స్ కొడుతూ ఎప్పుడూ సినిమాలు చేస్తోన్న కళ్యాణ్‌ రామ్ ఈ సారి భారీ బడ్జెట్ మూవీతో బింబిసార సినిమా చేస్తున్నాడు అన్నప్పుడు చాలామంది నవ్వుకున్నారు. అతను ఇలాంటి కథలకు సూట్ అవుతాడా అని సెటైర్స్ వేసుకున్నారు. ఆ మాటల సంగతి ఎలా ఉన్నా.. అతను మాత్రం ఒక్కో షెడ్యూల్ ఫినిష్‌ చేసుకుంటూ సినిమాను ఆగస్ట్ 5న విడుదల చేస్తున్నాం అని ప్రకటించాడు. ఈ మంగళవారం కళ్యాణ్ రామ్ బర్త్ డే. ఈ సందర్భంగా బింబిసార ట్రైలర్ ను ఒక రోజు ముందుగానే విడుదల చేసి సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశాడు.క్రీస్తు పూర్వం 540వ శతాబ్దానికి చెందిన త్రిగడ్తల రాజు బింబిసారుడు. చిన్న వయసులోనే సింహాసనాన్ని అధిష్టించిన బింబిసారుడు కాస్త క్రూరమైన రాజుగా చరిత్రలో నిలిచిపోయాడు. అలాంటి వ్యక్తి కథత సినిమా అంటే కాస్త ఆశ్చర్యమే. ఆ పాత్రలోనే కళ్యాణ్‌ రామ్ కనిపిస్తున్నాడు. ఫాంటసీ ఫిక్షన్ జానర్ లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ఆసాంతం ఆకట్టుకునేలా మలిచేందుకు ప్రయత్నించారు.

విజువల్ ఎఫెక్ట్స్ బావున్నాయి. పాత్రను స్టడీ చేసినట్టుగా కనిపిస్తోంది. ఆ కాలం తో పాటు ఈ కాలానికి కూడా అనుసంధానించారు. ఈ రెండూ చూస్తున్నప్పుడు మగధీర గుర్తుకు రావడం ఆశ్చర్యమేం కాదు. పైగా దానికి దగ్గరగా ఉన్న పాత్రలు కూడా కనిపిస్తున్నాయి. అప్పట్లో దాచిన నిధుల కోసం, ఇప్పుడు దుండగులు ప్రయత్నించడం.. మళ్లీ బింబిసారుడే ఈ కాలంలో జన్మించడం వంటి కాన్సెప్ట్ కూడా కనిపిస్తోంది. కాన్సెప్ట్ పరంగా ఇది తెలుగు సినిమాకు కొత్త కాదు. కానీ బింబిసారుడి కోణంలో ఎలా చెప్పారా అనేది ఆసక్తి కరంగా ఉంది. ట్రైలర్ వరకూ చూస్తే పైసా వసూల్ లానే ఉంది. అయితే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని పూర్తి స్థాయిలో ఎలా హ్యాండిల్ చేశాడా అనేదాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. పట్టుమని వందమంది కూడా లేరు.. ఓ యుద్ధం మీదపడితే ఎలా ఉంటుందో చూస్తారా అనే డైలాగ్ సినిమా కెపాసిటీని తెలియజేస్తోంది. కాకపోతే కళ్యాణ్‌ రామ్ సంభాషణల్లో స్పష్టత లోపించింది. డైలాగ్స్ చెప్పడంలో నందమూరి హీరోలు తోపు అనుకుంటే ఇది సరిపోదు.

Related Posts