ad

ఒక హీరోకు అనుకున్న మరో హీరోకు వెళ్లడం.. అక్కడ బ్లాక్ బస్టర్ కావడం చాలాకాలంగా చూస్తూనే ఉన్నాం. ఒక్కోసారి ముందు చెప్పిన హీరోకు కథ నచ్చదు. మరోసారి కథ నచ్చినా.. డేట్స్ ఉండవు. అన్నీ ఉన్నా.. ఎవరో ఎంటర్ అయి మార్పులు చేర్పులు అడగటం.. ఇలాంటి రీజన్స్ తో ఆ కథ మరో హీరోకు వెళుతుంది. అలాగే లేటెస్ట్ గా యంగ్ టైగర ఎన్టీఆర్ కు అనుకున్న కథ.. అతనికీ నచ్చిన కథ.. మరో మాస్ హీరోకు వెళ్లింది. అతను ఓకే చెప్పడంతో త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. ఇంతకీ ఈ రెండో హీరో ఎవరు.. చిత్రానికి డైరెక్టర్ ఎవరూ అంటారా.. ?ప్రతి దర్శకుడికీ ఓ శైలి ఉంటుంది. అలా తనకంటూ ప్రత్యేకమైన శైలి ఉన్న తమిళ్ డైరెక్టర్ హరి. అతని సినిమాలన్నీ సూపర్ ఫాస్ట్ గా వెళుతుంటాయి. కాస్త తల పక్కకి తిప్పితే రెండు మూడు ఫ్రేమ్ లు మిస్ అవుతుంటాం. అంత వేగంగా ఉంటుంది స్క్రీన్ ప్లే. ఈ విషయంలో ఇండియాలో హరి తర్వాతే ఎవరైనా. సింగం మూవీ సిరీస్ లతో తెలుగులోనూ పాపులర్ అయిన హరి..

ఇప్పటి తమిళ్ డైరెక్టర్స్ ట్రెండ్ ను ఫాలో అవుతూ తనూ తెలుగులో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. ఇందుకోసం కథ రాసుకుని ఎన్టీఆర్ వద్దకు వెళ్లాడు. యంగ్ టైగర్ కు కథ బాగా నచ్చింది. కానీ ఇప్పుడు కమిట్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. కొరటాల శివతో సినిమా ఉంది. వెంటనే ప్రశాంత్ నీల్ మూవీ ఉంటుంది. బట్ అప్పటి వరకూ ఆగాలంటే హరికి ఇష్టం లేదు. దీంతో ఇదే స్టోరీతో మేచో స్టార్ వద్దకు వెళ్లాడట.మేచో స్టార్ గా మాస్ లో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న హీరో గోపీచంద్. అతని వద్దకే హరి కథ వెళ్లింది. కథ బావుండటంతో వెంటనే గోపీచంద్ కూడా ఎస్ అనేశాడు. పైగా ఇలాంటి మాస్ కథలైతే గోపీచంద్ మరింత చెలరేగిపోతాడు కదా..? పైగా ఆల్రెడీ ఎన్టీఆర్ వంటి స్టార్ కు నచ్చిన స్టోరీ కూడా. సో.. హరి – ఎన్టీఆర్ కాంబో కాస్తా హరి- గోపీచంద్ కాంబోగా మారింది. ఇప్పటికే ఫిక్స్ అయిపోయిన ఈ కాంబినేషన్ గురించి.. షూటింగ్ అప్డేట్స్ గురించి త్వరలోనే ఓ ప్రకటన వస్తుందట. మొత్తంగా పక్కా కమర్షియల్ తో కెరీర్ లోనే హయ్యొస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న గోపీచంద్ కు హరి అయినా సాలిడ్ హిట్ ఇస్తాడేమో చూడాలి.

, , , , , ,