లోకానికి తెలియని భర్తను పరిచయం చేయబోతోన్న యాంకర్..?

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటారు. అయితే సినిమా పరిశ్రమలో ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. పెళ్లైన అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరు.. రావు అని. ముఖ్యంగా సౌత్ లో ఈ సెంటిమెంట్ ఎక్కువ. అందుకే ఓ నటి తన పెళ్లిని దాచింది. గతంలో జరిగిన వివాహ విషయం బయటకుత తెలియకుండా మెయిన్టేన్ చేస్తోంది. చిన్న చిన్న పాత్రలతో తెలుగు తెరకు పరిచయమై.. ఆ తర్వాత ఓ టివి ఛానల్ లో వస్తోన్న కామెడీ షోలో హాట్ హాట్ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ షోతో వచ్చిన పాపులారిటీ వల్ల తను ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గానూ నటించింది.
విశేషం ఏంటంటే.. సినిమా హీరోయిన్లకంటే యాంకర్లే ఎక్కువగా గ్లామర్ చూపించే ఈ షోలో కొన్నాళ్లుగా ఈ యాంకర్ డ్రెస్సింగ్ మారింది. పద్ధతిగా కనిపిస్తోంది. ఏ మాత్రం అశ్లీలత లేకుండా చూసుకుంటోంది. ఆ డ్రెస్ససింగ్ గా మారిన టైమ్ కు ముందే తన పెళ్లైందట.ఆ పెళ్లికి పెట్టిన మొదటి కండీషన్ అదే అంటున్నారు. అయితే ఇదే షోలో తను ఓ లవ్ ట్రాక్ తోనూ ఫేమ్ అయింది. ఆ ట్రాక్ ట్రాప్ లో చాలామంది ఆడియన్సెస్ పడిపోయారు. నిజంగానే వాళ్లు లవర్స్ అనుకుంటున్నారు. బట్ ఆమెకు పెళ్లైంది.
ఇక రీసెంట్ గా తనకు ఓ మెగా సినిమాలో భారీ ఐటమ్ సాంగ్ ఆఫర్ వచ్చింది. అప్పటి నుంచే ఆమె భర్త తనను ప్రపంచానికి పరిచయం చేయమని ఒత్తిడి చేస్తున్నాడట. ఈ విషయంలో తనూ ఓ నిర్ణయానికి వచ్చిందని.. త్వరలోనే తన భర్తను లోకానికి పరిచయం చేయబోతోందని టాక్. విశేషం ఏంటంటే.. ఈ పరిచయం కార్యక్రమంలో తమ పెళ్లి కొన్ని రోజుల క్రితమే అయినట్టు చెప్పబోతున్నారట. పాపం ఈ విషయం తెలిస్తే సదరు యాంకర్ తో లవ్ ట్రాక్ అంటూ ఆ ఛానల్ చేసిన రచ్చన నిజమని నమ్మిని అమాయక ప్రేక్షకులు ఏమైపోతారో మరి.

Related Posts