అమ్మా వినమ్మా.. నేను ఆనాటి నీ లాలిపదాన్నే

అమ్మా వినమ్మా.. నేనాటి నీ లాలిపదాన్నే.. ఈ మాట వినగానే ఎంత హాయిగా ఉందో కదా.. ఇది శర్వానంద్ హీరోగా నటిస్తోన్న ‘ఒకేఒక జీవితం’నుంచి విడుదలైన లేటెస్ట్ సాంగ్. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ సాంగ్ అద్భుతమైన మెలెడీగా కనిపిస్తోంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి మాత్రమే ఇలాంటి పాట రాయగలడు అని మరోసారి ప్రతి ఒక్కరూ ఆయన్ని జ్ఞాపకం చేసుకునేలా హృదయాలను మురిపించేలాంటి లిరిక్స్ తో మెస్మరైజ్ చేశారాయన.
జేక్స్ బెజోయ్ మ్యూజిక్ అందిస్తోన్న చిత్రం ఒకేఒక జీవితం. ఈ పాటను సిధ్ శ్రీరామ్ ఆలపించాడు. అయితే ఎందుకో ఈ పాటకు అతను రాంగ్ ఛాయిస్ అనిపించింది. ఇలాంటి లిరిక్స్ ను తెలుగు తెలిసిన సింగర్ తో పాడిస్తే ఆ అనుభూతి మరింత మంచిగా ప్రేక్షకులను చేరేది అని అనిపించక మానదు. సిధ్ బాగా పాడలేదు అని కాదు. కానీ తెలుగువాళ్లైంతే ఆ ఫీల్ మరింత బాగా వచ్చేది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సంగీతం పరంగా ట్యూన్ హాయిగా సాగిపోయేలా ఉంది.
ఇక శర్వానంద్ ప్రస్తుతం వరుస డిజాస్టర్స్ లో ఉన్నాడు. దీంతో పాటు ఆడవాళ్లూ మీకు జోహార్లు అనే మూవీస్ తో రాబోతున్నాడిప్పుడు. ఒకేఒక జీవితం అనే ఈ మూవీ టీజర్ ను ఆ మధ్య విడుదల చేశారు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే కథలా కనిపిస్తోంది. శర్వా సరసన రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తోన్న ఈచిత్రంలో అంతే కీలకమైన పాత్రలను ప్రియదర్శి, వెన్నెల కిశోర్ చేస్తున్నారు. అమల అతని తల్లి పాత్రలో కనిపించబోతోంది. మొత్తంగా మదర్ సెంటిమెంట్ నేపథ్యంగా సాగే పాటల్లో ఈ పాటకూ ఖచ్చితమైన స్థానం ఉంటుందని చెప్పొచ్చు.

Related Posts