జానూ చిత్రాన్నే మళ్లీ తీశారా.. ?

మనుషులను పోలిన మనుషులే కాదు.. సినిమాలను పోలిన సినిమాలూ ఉంటాయి. అయితే మనుషులతో వచ్చే ఇబ్బందేం లేదు. కానీ సినిమాలతో నిర్మాతలకు లాస్.. ప్రేక్షకులను హెడేక్ తప్పవు. అలాగని పోలికలున్న సినిమాలన్నీ బోర్ కొడతాయని కాదు. కాకపోతే మరీ ఎక్కువ టైమ్ గ్యాప్ లేకుండా వస్తే మాత్రం ఖచ్చితంగా కంపేరిజన్స్ పెరుగుతాయి. అలాంటి సినిమాలానే అనిపిస్తోంది ‘టెంత్ క్లాస్ డైరీస్’. అప్పుడెప్పుడో రోజాపూలు చిత్రంతో ఆకట్టుకున్న శ్రీరామ్(తమిళ్ లో శ్రీకాంత్), అవికా గోర్, శ్రీనివాసరెడ్డి, హిమజ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈచిత్రానికి అంజి దర్శకుడు. ఇతను గతంలో గరుడవేగ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు. గరుడవేగ హైలెట్స్ లో సినిమాటోగ్రఫీ ఒకటని ఖచ్చితంగా చెప్పొచ్చు. అందుకే తన పేరుకు ముందు అది చేర్చుకుని గరుడవేగం అంజి అని వేసుకుంటున్నాడు. ఇంత వరకూ బానే ఉంది కానీ.. లేటెస్ట్ గా విడుదలైన టీజర్ చూస్తేనే ఈ కథలో ఏమంత కొత్తదనం లేదని తెలుస్తోంది.
కొందరు వ్యక్తులు.. ఒక చోట కలిసి తమ బాల్యాన్ని గుర్తు చేసుకోవడం. అంతా కలిసి మరోసారి రీ యూనియన్ ప్లాన్ చేసుకుందా అనుకోవడం. ఆ క్రమంలో ప్రధాన పాత్రధారి తను వెదికే అమ్మాయి కోసం అదే పనిగా చూడటం.. ఈ క్రమంలో అంతా కలిసి మరోసారి తమ బాల్యంలోకి వెళ్లడం.. స్కూల్ డేస్ లోని ప్రేమకథలను గుర్తుకు చేసుకోవడం.. ఇవన్నీ చూస్తుంటే ఇదీ రీసెంట్ గానే వచ్చిన శర్వానంద్, సమంత నటించిన జానూ సినిమా గుర్తొస్తుంది కదూ. యస్.. ఈ మూవీ కాన్సెప్ట్ కూడా అదే. కాకపోతే హీరోయిన్ మేటర్ ను మరోలా మార్చినట్టు తెలుస్తుంది. అది కూడా అంతకు ముందే రవితేజ నటించిన ఆటోగ్రాఫ్ సినిమాను గుర్తుకు చేసేలా ఉంది. మొత్తంగా ఈ మధ్యే వచ్చిన సినిమాలన్నీ కలిపి ఓ కిచిడీ కథను తయారు చేసుకున్నారని టీజర్ లోనే అనిపిస్తే.. ఆ లోపం కథకుడు, దర్శకుడిదే అవుతుంది. మరి ఈ డైరీస్ ఎలా ఉంటాయో కానీ.. టీజర్ మాత్రం ఏమంత ఆకట్టుకోలేదనే చెప్పాలి.
మరో విశేషం ఏంటంటే.. ఆటోగ్రాఫ్, జానూ చిత్రాల తమిళ మాతృకలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ వాటి తెలుగు వెర్షన్స్ రెండూ పోయాయి.

Related Posts