అఖండ ప్ల‌స్, మైన‌స్ ఇవే

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌, ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందిన భారీ యాక్ష‌న్ మూవీ అఖండ‌. సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్లో రూపొందిన మూవీ కావ‌డంతో అటు అభిమానుల్లోను ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే అఖండ అఖండ‌మైన విజ‌యం దిశ‌గా దూసుకెళుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్ లో సైతం రికార్డు క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుండ‌డం విశేషం.

ఇదిలా ఉంటే.. జెన్యూన్ గా అఖండ మూవీలో ఉన్న ప్ల‌స్ అండ్ మైన‌స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్ల‌స్ లు గురించి చెప్పాలంటే.. ఇందులో బాల‌య్య న‌ట విశ్వ‌రూపం చూపించారు. బాల‌య్య న‌ట‌న‌, డైలాగులు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇక విల‌న్ గా శ్రీకాంత్ ని కొత్త‌గా చూపించారు. ఈ క్యారెక్ట‌ర్ ప్ల‌స్ అని చెప్ప‌చ్చు. ఇక యాక్ష‌న్ ఎపిసోడ్స్ అయితే.. వేరే లెవ‌ల్ ఉన్నాయి. ఏం తీసాడ‌రా అంటూ ప్రేక్ష‌కులు షాక్ అయ్యేలా ఉన్నాయి. సంద‌ర్భానుసారంగా వ‌చ్చిన డైలాగులు, త‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఇవ‌న్నీ సినిమాకి ప్ల‌స్ పాయింట్స్.

మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే.. ఫస్ట్ ఆఫ్ సోసోగా సాగింద‌నిపిస్తుంది. హింస విపరీతంగా ఉండటం మైన‌స్ అని చెప్ప‌చ్చు. అలాగే హీరోయిన్ ట్రాక్ కూడా సెట్ కాలేదు. నేచుర‌ల్ గా లేదు. మ‌రో మైన‌స్ ఏంటంటే.. లెంగ్త్ ఎక్కువు కావ‌డం. ఏది ఏమైన‌ప్ప‌టికీ.. అఖండ మాత్రం అంద‌రికీ క‌నెక్ట్ అయ్యింది. సూప‌ర్ హిట్ టాక్ తో దూసుకెళుతుంది.

Related Posts