అదరగొట్టావ్ బాబాయ్ అంటున్న ఎన్టీఆర్

బాలకృష్ణ ‘అఖండ’ చిత్రం సూపర్బ్ అంటూ అప్రిషియేట్ చేశారు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. ఈ సినిమాలో బాబాయ్‌ ఇరగదీశారని అన్నారు. ‘‘ఇప్పుడే ‘అఖండ’ చిత్రాన్ని వీక్షించాను. సూపర్ సక్సెస్‌ని సొంతం చేసుకున్న బాలకృష్ణ బాబాయ్‌తో పాటు టీమ్ మొత్తానికి నా అభినందనలు. ఆయన నుంచి ఎలాంటి మూమెంట్స్‌ అయితే కోరుకుంటామో అవన్నీ అఖండ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి’’ అని ఎన్టీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు.

గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ ఓవర్సీస్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన ఓపెనింగ్స్ రాబట్టింది.

Related Posts