HomeMoviesటాలీవుడ్మూడు సినిమాల అప్డేట్స్ తో వచ్చిన విజయ్ దేవరకొండ

మూడు సినిమాల అప్డేట్స్ తో వచ్చిన విజయ్ దేవరకొండ

-

ఈరోజు (మే 9) రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పుట్టినరోజు. ఈ సందర్భంగా విజయ్ నటిస్తున్న మూడు సినిమాలకు సంబంధించి క్రేజీ అప్డేట్స్ ను ఫ్యాన్స్ కు అందించారు మేకర్స్. ముందుగా విజయ్ దేవరకొండ నటిస్తున్న 12వ సినిమాకి సంబంధించి ఆసక్తికర అంశాలను నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్స్ మెంట్స్ తెలిపింది.

విజయ్ కి బర్త్ విషెస్ తెలుపుతూ.. రౌడీ ఫ్యాన్స్ అందరికీ తాము త్వరలోనే మంచి సినిమా అందించబోతున్నామని ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం విశాఖపట్నం పరసర ప్రాంతాల్లో ‘వి.డి.12‘ షూటింగ్ జరుతుందని.. త్వరలోనే ఓ స్నీక్ పీక్ రిలీజ్ చేయబోతున్నట్టు ఈ నోట్ లో తెలిపింది నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని.. సితార తో పాటు, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

‘ఫ్యామిలీ స్టార్‘ తర్వాత విజయ్ దేవరకొండ.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటించే సినిమాకి సంబంధించి కూడా క్రేజీ పోస్టర్ రిలీజైన సంగతి తెలిసిందే. ‘కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే..‘ అంటూ ఆసక్తికరంగా ఉన్న ఈ పోస్టర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. రవి కిరణ్ కోలా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే.. ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇక.. ఇప్పటికే విజయ్ దేవరకొండ కి ‘టాక్సీవాలా‘ వంటి విజయాన్నందించిన రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో సినిమాకి సంబంధించి కూడా క్రేజీ అప్డేట్ వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో విజయ్-రాహుల్ మూవీ తెరకెక్కబోతుంది. ఈ సినిమాని 1854 మరియు 1878 మధ్య కాలంలో జరిగే కథగా తెరకెక్కించబోతున్నాడు రాహుల్ సంకృత్యాన్. విజయ్ 14వ చిత్రంగా తెరకెక్కే ఈ మూవీ నుంచి ఆసక్తికర పోస్టర్ రిలీజ్ చేసింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. తెలుగు తో పాటుగా, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదలకానుంది.

ఇవీ చదవండి

English News