‘తండేల్‘ నుంచి సాయిపల్లవి స్పెషల్ బర్త్ డే గ్లింప్స్

ఈరోజు (మే 9) సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా ‘తండేల్‘ మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసింది టీమ్. సాయిపల్లవి గతంలో పోషించిన మలర్, భానుమతి, పల్లవి, దేవదాసీ, రౌడీబేబి వంటి పాత్రలను చూపిస్తూనే.. ‘తండేల్‘ మూవీలో బుజ్జి తల్లి పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుపుతూ ఆమె క్యారెక్టర్ గ్లింప్స్ రిలీజ్ చేసింది టీమ్.

‘తండేల్‘ మూవీ సెట్స్ లో సాయిపల్లవి చేసిన సందడితో ఈ గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. అలాగే.. ఈ మూవీలో ఆమె తన నటనలో చూపించే వేరియేషన్స్ కూడా ఈ గ్లింప్స్ లో శాంపిల్ గా చూపించారు. ఈ సినిమాలో నాగచైతన్య కి జోడీగా సాయిపల్లవి నటిస్తుంది. చందూ మొండేటి దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ‘తండేల్‘ రాబోతుంది. ఈ ఏడాది డిసెంబర్ 20న ‘తండేల్‘ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Posts