మీ ఫ్యామిలీ స్టార్స్ కోసం వస్తోన్న ‘ఫ్యామిలీ స్టార్‘ టీమ్

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్‘ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో ‘ఫ్యామిలీ స్టార్‘ థియేట్రికల్ రన్ సక్సెస్ ఫుల్ కంటిన్యూ అవుతోందని చిత్రబృందం చెబుతోంది. ఇక.. తమ ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడే వాళ్లంతా ఫ్యామిలీ స్టార్సే అనేది ఈ మూవీ స్టోరీ లైన్. అలాంటి ఫ్యామిలీ స్టార్స్ ను కలిసేందుకు ‘ఫ్యామిలీ స్టార్‘ టీమ్ సర్ ప్రైజ్ విజిటింగ్ కు రాబోతుంది. మీ ఇంటి ఫ్యామిలీ స్టార్ ను ‘ఫ్యామిలీ స్టార్‘ టీమ్ కలవాలని కోరుకునే రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ఇది గొప్ప అవకాశం అని చిత్రబృందం చెబుతోంది.

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ హ్యాండిల్ లో ఓ ఫామ్ ను షేర్ చేసింది టీమ్. ఆ ఫామ్ ఫిల్ చేస్తే ఫ్యామిలీ స్టార్ టీమ్ హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, దర్శకుడు పరశురామ్ మీ ఇంటికి వచ్చి మీ ఫ్యామిలీ స్టార్ ను సర్ ప్రైజ్ చేస్తారు. ఈ ఫామ్ లో మీ పేరు అడ్రస్ తో పాటు మీ ఫ్యామిలీ స్టార్ ఎ‌వరు, ఎందుకు అనే ప్రశ్నలకు ఆన్సర్స్ రాసి ఫిల్ చేయాలి

Related Posts