పూజాహెగ్డే స్థానంలో మరో త్రివిక్రమ్ హీరోయిన్

గుంటూరు కారం నుంచి పూజా హెగ్డే తప్పుకుంది. అయితే కొందరు తనను కావాలనే తప్పించారు అని కూడా అంటున్నారు. అందులో నిజా నిజాలెలా ఉన్నా.. ఇప్పుడు ఆ ప్లేస్ ను రీ ప్లేస్ చేయాలి కదా..? అందుకోసం తను తెలుగు నేర్పించిన మరో హీరోయిన్..

టాలీవుడ్ లో అడుగుపెట్టిన దగ్గర్నుంచీ వరుస హిట్స్ కొడుతోన్న సంయుక్త మీనన్ ను తీసుకోబతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. సంయుక్త తెలుగులో ఫస్ట్ సైన్ చేసిన సినిమా విరూపాక్ష. కానీ ఇది బాగా ఆలస్యం అయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌, రానా నటించిన భీమ్లా నాయక్ తో తెలుగువారికి పరిచయం అయింది.

ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు అందించిన త్రివిక్రమ్ ఈమెకు తెలుగు కూడా నేర్పించాడు. ఆ మూవీ ఫంక్షన్ లోనే ఏకంగా తెలుగులో మాట్లాడి ఆకట్టుకుంది. ఆ తర్వాత తను నటించిన బింబిసార హిట్. ఇందులో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా హిట్ మూవీలో పార్ట్ అయింది. ఇక సార్ కూడా సూపర్ హిట్ కావడంతో హ్యాట్రిక్ బ్యూటీ అనిపించుకుంది.

ఇక విరూపాక్షలో నటనతో అదరగొట్టింది. ఈ మూవీ సక్సెస్ లో తను కూడా మేజర్ రోల్ ప్లే చేసిందంటే అతిశయోక్తి కాదు. క్లైమాక్స్ నటనతో ఓ రకంగా జనాలను భయపెట్టేసింది కూడా. ఇక గ్లామర్ పరంగానూ పెద్దగా హద్దులు లేని ఈ మళయాలీ ముద్దుగుమ్మను పూజా హెగ్డే ప్లేస్ లో తీసుకోబోతున్నారు అంటున్నారు. పైగా తను ఈ బ్యానర్ లో ఆల్రెడీ సార్ మూవీ చేసింది. అది కూడా కలిసొచ్చే అంశమే.

అటు తనకు లక్కీ బ్యూటీ అన్న ట్యాగ్ కూడా ఉంది. ఇదీ ప్లస్ అవుతుంది. కాకపోతే మరీ గొప్ప అందగత్తె కాదు కాబట్టి మహేష్‌ బాబు సరసనే కాదు.. శ్రీ లీల ముందు కూడా తేలిపోతుందని చెప్పొచ్చు. దీనికి తోడు అసలు తనను మహేష్‌ ఒప్పుకుంటాడా అనే డౌట్ కూడా ఉంది.


ఏదేమైనా పూజాహెగ్డే ఎందుకు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందో కానీ ఇప్పుడు మరో హీరోయిన్ వేటలో మరింత మూవీ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి.

Related Posts