బికినీలో హీట్ పుట్టిస్తున్న పూజ

నిన్న మొన్నటిదాకా వరుస సినిమాలతో బిజీగా ఉన్న పూజా హెగ్డే చేతిలో ఇప్పుడు ఒక్కటంటే ఒక్క చిత్రం కూడా లేదు. భారీ అంచనాలతో వచ్చిన సినిమాలన్నీ ఫెయిల్ అవ్వడంతో ప్రస్తుతం ఖాళీగా ఉంది ఈ కన్నడ బ్యూటీ. అందుకే దొరికిన సమయాన్ని తనకు నచ్చిన రీతిలో ఎంజాయ్ చేస్తుంది. తన బర్త్ డే ని ఎంజాయ్ చేయడానికి మాల్డీవ్స్ వెళ్లిన పూజ.. అక్కడ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉంది.

లేటెస్ట్ గా పూజ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. గ్రీన్ బికినీలో హీట్ పుట్టిస్తున్న తన ఫోటోకి తానే ఐలండ్ బేబి అంటూ టైటిల్ కూడా ఇచ్చింది. బికినీ వేసుకోవడం పూజాకి కొత్తేమీ కాదు. కెరీర్ స్టార్టింగ్ లో మోడల్ గా పనిచేసినప్పుడు.. మిస్ ఇండియా పోటీలకు వెళ్లినప్పటి బికినీ ఫోటోస్.. ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇక.. ‘దువ్వాడ జగన్నాథమ్‘లో కాసేపు బికినీలో కనిపించి కుర్రకారును కైపెక్కించింది.

ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ ‘గాంజా శంకర్‘లో పూజా హెగ్డే హీరోయిన్ అనే ప్రచారం జరిగింది. ఇంతవరకూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. అలాగే రవితేజ, మలినేని గోపీచంద్ సినిమాలోనూ పూజా పేరు బలంగా వినిపిస్తుంది.

Related Posts