హృతిక్ కి బర్త్ డే విషెస్ తెలిపిన ఎన్టీఆర్

‘ఆర్.ఆర్.ఆర్’తో టాలీవుడ్ లో అసలెవరూ ఊహించని మల్టీస్టారర్ కి నాంది పలికిన ఎన్టీఆర్.. ఇప్పుడు ‘వార్ 2‘తో మరో సంచలనానికి తెరలేపాడు. కనీవినీ ఎరుగని రీతిలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి మల్టీస్టారర్ చేస్తున్నాడు. ఒకవైపు ‘దేవర’ షూటింగ్ ను పూర్తిచేస్తూనే.. మరోవైపు ‘వార్ 2’పైనా స్పెషల్ ఫోకస్ పెడుతున్నాడు. త్వరలోనే ‘వార్ 2’ సెట్స్ లో జాయిన్ కానున్నాడు. ఇక.. ఈరోజు (జనవరి 10) గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ హృతిక్ రోషన్ పుట్టినరోజు సందర్భంగా.. అతనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేశాడు తారక్.

‘వార్‘ ఫ్రాంచైస్ అనగానే హై ఆక్టేన్ స్టంట్స్ గుర్తుకొస్తాయి. ‘వార్ 2‘లోనూ అలాంటి యాక్షన్ ఘట్టాలకు కొదవే లేదట. ఇటీవలే ‘వార్ 2‘కి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ ను ఫినిష్ చేశాడు డైరెక్టర్ అయన్ ముఖర్జీ. అయితే ఈ షెడ్యూల్ లో లీడ్ యాక్టర్స్ ఇద్దరూ లేకపోవడం విశేషమని చెప్పాలి. విడుదల తేదీల విషయంలో బాలీవుడ్ మేకర్స్ ఎంతో పక్కాగా ఉంటారు. ఏడాది, రెండేళ్ల తర్వాత వచ్చే సినిమాలకు సంబంధించిన రిలీజ్ డేట్స్ ను ముందుగానే ప్రకటిస్తుంటారు. ఈకోవలోనే ఎన్టీఆర్-హృతిక్ మల్టీస్టారర్ ‘వార్ 2’ని 2025, ఆగస్టు 14న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్.

Related Posts