Pawan kalyan :ఏంటీ పవన్ కళ్యాణ్‌ దేవుడు కాదా ‘బ్రో’..?

వినోదాయ సీతమ్.. తమిళ్ లో సూపర్ హిట అయిన ఈ చిత్రాన్ని తెలుగులో ”బ్రో” పేరుతో రీమేక్ చేస్తున్నాడు సముద్రఖని.

అక్కడ ఇది చాలా చిన్న సినిమా. తనూ ఓ ప్రధాన పాత్ర చేశాడు సముద్రఖని. అసలు పాత్ర తంబి రామయ్య అనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేశాడు. ఈ మూవీలో సముద్రఖని దేవుడుగా కనిపిస్తాడు.

కమర్షియల్ వాల్యూస్ అంటే కంటెంట్ వాల్యూ ఎక్కువగా ఉన్న చిత్రం ఇది. అలాంటి సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నప్పుడు ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ దొరుకుతాడా అని చూస్తారు. బట్ ఏకంగా పవన్ కళ్యాణ్‌ తనే ఇంట్రెస్ట్ చూపించడంతో చాలా వేగంగా తెలుగు రీమేక్ స్టార్ట్ అయింది.

తెలుగు వెర్షన్ కు తగ్గట్టుగా స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ రాశాడు. ఇక ప్రధాన పాత్రల్లో పవన్ కళ్యాణ్‌ తో పాటు ఆయన మేనల్లుడు సాయితేజ్ ను తీసుకున్నారు. దీంతో సహజంగానే పవన్ కళ్యాణ్‌ సముద్రఖని చేసిన దేవుడు పాత్రలో నటిస్తున్నాడు అనే అనుకున్నారు అందరూ.

బట్ లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి సాయితేజ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మార్క్ అలియాస్ మార్కండేయులు అనేది ఆయన పాత్ర పేరు. అంటే అక్కడ సముద్ర ఖని చేసిన పాత్ర ఇక్కడ సాయితేజ్ చేస్తున్నాడు.

తంబి రామయ్య పాత్రలో పవన్ కళ్యాణ్‌ నటిస్తున్నాడు. ఓ రకంగా ఇది పవన్ ఇమేజ్ కు భిన్నమైన పాత్ర.తెలుగులో ఎలా రాశారో కానీ.. హీరోయిజం అనే మాటే వినిపించదీ పాత్రలో. అనేక కుటుంబ సమస్యలున్న వ్యక్తి మరో మూడు నెలల్లో చనిపోతాడు అని తెలిస్తే అతని జీవితం ఎలా ఉంటుంది. ఆ మూడు నెలల పాటు అతనితో పాటే దేవుడు కూడా ఉంటాడు. ఈ క్రమంలో జరిగే సంఘటనలే సినిమా. అలాంటి పాత్రలో నటించేందుకు పవన్ కళ్యాణ్‌ ఒప్పుకోవడం నిజంగా సాహసమే.


ఇక మార్క్ అలియాస్ మార్కండేయులుగా సాయితేజ్ లుక్ అద్దిరిపోయిందనే చెప్పాలి. వైట్ అండ్ వైట్ కాస్ట్యూమ్స్ తో స్టైలిష్‌ గా వాకింగ్ చేసుకుంటూ వస్తోన్న స్టిల్ ఇది. పోస్టర్ లో సినిమా కాన్సెప్ట్ ఎలివేట్ అయ్యేలా వాచ్ కనిపిస్తోంది. టైమ్ గడుస్తూ ఉన్నట్టుగా చూపించారు. మొత్తంగా సాయితేజ్ లుక్ తో పవన్ కళ్యాణ్‌ అంతా అనుకున్నట్టు దేవుడు పాత్రలో కాక కాస్త భారమైన గృహస్తు పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని జూన్ 28న విడుదల చేయబోతున్నారు.

Related Posts