‘స్పిరిట్’ లో ప్రభాస్ చాన్స్ ఇస్తే నటిస్తా: రన్‌బీర్ కపూర్

బాలీవుడ్ స్టార్ రన్‌బీర్ కపూర్ టాలీవుడ్ మూవీస్ లో అవకాశం వస్తే నటించడానికి రెడీగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌ స్టాపబుల్ టాక్ షోలో వెల్లడించారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రన్‌బీర్, రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన ‘యానిమల్’ సినిమా ఈ డిసెంబర్ 1వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ‘యానిమల్’ టీమ్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

దీనిలో భాగంగానే ఇటీవల హైదరాబాద్ వచ్చిన చిత్రబృందం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షోకి వచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిన రన్‌బీర్..ప్రభాస్ నటించబోతున్న ‘స్పిరిట్’ మూవీలో సందీప్ చిన్న రోల్ ఇచ్చినా చేస్తానని చెప్పాడు. ఈరోజు నుంచి ఆహాలో స్ట్రీమింగ్ లోకి వచ్చిన ‘యానిమల్’ టీమ్ ఇంటర్వ్యూ కి మంచి ఆదరణ లభిస్తోంది. అలాగే, రన్‌బీర్ చెప్పిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. మరి సందీప్ రెడ్డి ప్రభాస్ తో తెరకెక్కించబోయే ‘స్పిరిట్’ మూవీలో రన్‌బీర్ కి అవకాశం ఇస్తాడా లేదా చూడాలి.

Related Posts