తమ్ముడు దర్శకత్వంలో అన్న.. అస్సలు ఊహించని సన్నివేశం ఇది

కోలీవుడ్ బ్రదర్స్ ధనుష్, సెల్వరాఘవన్ లది హిట్ కాంబినేషన్. అన్న సెల్వ రాఘవన్ దర్శకుడైతే.. తమ్ముడు ధనుష్ నటుడు. ఒకవిధంగా ధనుష్ ని హీరోగా తీర్చిదిద్దడంలో సెల్వ రాఘవన్ పాత్రే ఎక్కువ. ఈ అన్నాదమ్ముల కలయికలో వచ్చిన ‘కాదల్ కొండేన్, పుదుపెట్టయ్, మయక్కమ్ ఎన్నా’ వంటి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. ఈ సినిమాలు యాక్టర్ గా ధనుష్ ని ఓ రేంజులో నిలబెట్టాయి.

కట్ చేస్తే.. ఇప్పుడు ధనుష్ దర్శకుడిగానూ.. అన్న సెల్వరాఘవన్ నటుడిగానూ మారారు. ధనుష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రాయన్’ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు సెల్వరాఘవన్. ఇదే విషయాన్ని తెలుపుతూ.. మిమ్మల్ని ఎప్పుడూ డైరెక్ట్ చేస్తానని ఊహించలేదు సార్ అంటూ అన్న సెల్వరాఘవన్ ట్యాగ్ చేస్తూ.. ‘రాయన్’ సినిమాలో సెల్వ పోషిస్తున్న పోస్టర్ ను షేర్ చూశాడు ధనుష్. ‘రాయన్’ చిత్రం ధనుష్ ప్రెస్టేజియస్ 50వ సినిమా. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తూ.. దర్శకత్వం వహిస్తున్నాడు ధనుష్.

Related Posts