విజయ్ డ్యూయల్ రోల్ వెనుక అసలు కథ ఇదే

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు. రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయంతో అలరించబోతున్నాడు. ఇప్పటికే విజయ్ కి ‘టాక్సీవాలా’ వంటి విజయాన్నందించిన రాహుల్.. ఈ సినిమాని ఓ పీరియడ్ డ్రామాగా తీర్చిదిద్దుతున్నాడు.

విజయ్ గతంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో అలరించినా.. ఇదే అతనికి తొలి ద్విపాత్రాభినయం కాబోతుంది. ఇక.. విజయ్ కంటే ముందే ఈ సినిమాని కోలీవుడ్ బ్రదర్స్ సూర్య, కార్తీలతో తెరకెక్కించాలనుకుంటున్నాడట రాహుల్. వాళ్లిద్దరికీ కథ చెప్పడం.. వారికి నచ్చడం జరిగిందట. అయితే.. ఎందుకనో వారు ఈ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టారట. దీంతో ఇప్పుడు విజయ్ తో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడు రాహుల్ సంకృత్యాన్.

ఇప్పటికే ‘శ్యామ్ సింగరాయ్’ వంటి సినిమాతో పీరియాడిక్ జోనర్ లో బడా హిట్ అందుకున్నాడు రాహుల్ సంకృత్యాన్. ఇప్పుడు 18వ శతాబ్దం నేపథ్యంలో న్యూ మూవీలో విజయ్ ను ఎంతో విభిన్నంగా ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో విజయ్ కి జోడీగా రష్మిక నటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించే ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.

Related Posts