‘పురుషోత్తముడు’గా రాబోతున్న రాజ్ తరుణ్

యంగ్ హీరో రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ ‘పురుషోత్తముడు’. శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ లో డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రామ్ భీమన దర్శకుడు. రాజ్ తరుణ్ కి జోడీగా హాసిని సుధీర్ నటిస్తుండగా.. ఇతర కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర వంటి వారు కనిపించబోతున్నారు. గోపీ సుందర్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్.

పెద్దగా ప్రచారం లేకుండానే షూటింగ్ పూర్తిచేసుకున్న ‘పురుషోత్తముడు’ ఇప్పుడు టీజర్ తో వచ్చింది. ‘ఒక యుగంలో నాన్న మాట విన్న రాముడు దేవుడు అయ్యాడు.. అలాగే మరో యుగంలో నాన్న మాట వినని ప్రహ్లాదుడు మహనీయుడు అయ్యాడు.. మాట కాదు ధర్మం’ అంటూ రాజ్ తరుణ్ చెప్పే డైలాగుతో టీజర్ మొదలైంది. భారీ తారాగణంతో ఫక్తు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ‘పురుషోత్తముడు’ టీజర్ ఆకట్టుకుంటోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది చిత్రబృందం.

Related Posts