Pawan Kalyan : ఆహా.. పవన్ కళ్యాణ్‌ ఎన్నాళ్లకెన్నాళ్లకు..

టాలీవుడ్ లో మోస్ట్ అవెయిటెడ్ కాంబినేషన్స్ లో పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan) – హరీష్‌ శంకర్(Harish Shankar) కాంబో ఒకటి. వీరి కలయికలో 11యేళ్ల క్రితం వచ్చిన గబ్బర్ సింగ్(Gabbar Singh) సృష్టించిన సంచలనాలు జనం ఇంకా మర్చిపోలేదు. అప్పటి నుంచి మళ్లీ పవన్ తో హరీష్‌ సినిమా చేయాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. గబ్బర్ సింగ్ సీక్వెల్ హరీష్‌ శంకరే చేయాలి. కుదరలేదు.

ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఉస్తాద్ భగత్ సింగ్(Usthad Bhagath Singh) తో ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. బాగా లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టుగా మరోసారి పవర్ ఫుల కంటెంట్ తో వస్తున్నారని లేటెస్ట్ గా విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ తో గబ్బర్ సింగ్ ను మించిన ఎంటర్టైన్మెంట్ తో వస్తున్నానని చెప్పకనే చెప్పాడు హరీష్‌ శంకర్(Harish Shankar). పవన్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే ఆ పాత్రను డిజైన్ చేశాడు. చిన్న గ్లింప్స్ తోనే చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ అయిందంటే అతిశయోక్తి కాదు.


గ్లింప్స్ కూడా హరీష్‌ తో పాటు పవన్ స్టైల్ కు తగ్గట్టుగా ” ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో.. అధర్మము వృద్ధినొందునో.. ఆయా సమయములందు ప్రతి యుగమునందునా అవతారము దాల్చుచున్నాను అనే భగవద్గీత(Bhagavadgeetha) పఠనంతో ప్రారంభం కావడం విశేషం. ” భగత్ .. భగత్ సింగ్.. మహంకాళీ పోలీస్ స్టేషన్. పత్తర్ గంజ్ పాతబస్తీ అంటూ పవన్ కళ్యాణ్‌ చెప్పిన డైలాగ్ తో పాటు వచ్చిన విజువల్స్ కిరాక్ అనేలా ఉన్నాయి. అలాగే దిస్ టైమ్ ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ అనే కోట్ పడుతుంది. అంటే ఈసారి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు.. అంతకు మించి అనే అర్థం వచ్చేలా ఉందా మాట.

ఇక పోలీ స్టేషన్ లో పవన్ కళ్యాణ్‌ అగ్రెసివ్ గా ఉన్న సీన్స్ చూస్తే గబ్బర్ సింగ్ గుర్తుకు రాకమానదు. ఇక గ్లింప్స్ చివర్లో .. ‘ ఈ సారి పర్ఫార్మెన్స్ బద్ధలైపోద్ది’ అనే పవన్ డైలాగ్ ఫ్యాన్స్(Fans) కు పిచ్చెక్కేలా చేస్తుందని వేరే చెప్పక్కర్లేదేమో. మొత్తంగా హరీష్‌ శంకర్ ప్లాన్ వర్కవుట్ అయింది. పవన్ ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో ఆయన్ని ఈ తరహా అగ్రెసివ్ పాత్రలో చూడాలనుకుంటున్నారు. వారి కోరికకు మించి ఈ సారి సినిమా మామూలుగా ఉండదు అనేలా ఈ గ్లింప్స్ కనిపిస్తోంది. సో.. ఇక ఈ సారి రికార్డు(Records)లు కూడా మామూలుగా బద్ధలు కావేమో..

Related Posts