పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రేజీ స్టార్ రానా దగ్గుబాటి కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ మల్టీస్టారర్ భీమ్లా నాయక్. ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందించడం విశేషం. సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈరోజు రానా దగ్గుబాటి పుట్టినరోజు. ఈ సందర్భంగా భీమ్లా నాయక్ నుంచి అప్ డేట్ రానుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు నిజంగానే అప్ డేట్ రానుందని మేకర్స్ కన్ ఫర్మ్ చేశారు. ఒక మాస్ పోస్టర్ తో రానాకి బర్త్ డే విషెష్ చెబుతూ ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు స్వాగ్ ఆఫ్ డానియల్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. దీంతో స్పెషల్ టీజర్ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది. భీమ్లా నాయక్ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రతిదీ విశేషంగా ఆకట్టుకుంది. ఈరోజు రిలీజ్ చేసే స్పెషల్ వీడియో కూడా అదరడం ఖాయం అంటున్నారు.
ఇక రిలీజ్ విషయానికి వస్తే.. ఎవరు ఎన్ని చెప్పినా తగ్గేదేలే.. అంటున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న భీమ్లా నాయక్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. భీమ్లా నాయక్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సెట్ చేస్తాడో చూడాలి.