నాగ్ సినిమాలో జాతిరత్నాలు హీరోయిన్ స్పెషల్ సాంగ్

నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న బంగర్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ కు కమిట్ అయ్యింది జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దులా. జాతిరత్నాల్లాంటి ఇండ్ట్రీ హిట్ దక్కినా ఈ భామకు సరైన అవకాశాలు లేకుండా పోయాయి దాంతో ఇలా స్పెషల్ సాంగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫరియానే కాదు టాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హీరోయిన్స్ దక్కిన హీరోయిన్స్ ఎంతోమంది ఇలాగే తర్వాత అవకాశాలు రాక మెల్లగా ఫేడవుట్ అయ్యారు. ఆది హీరోయిన్ కీర్తి చావ్లా, ఆర్య మూవీ హీరోయిన్ అను మెహతా లాంటి వాళ్లు ఎందరో అలా సూపర్ హిట్ కొట్టి ఇలా కనిపించకుండా పోయారు. ఇదే టైమ్ లో మామూలు హిట్ సినిమాతో సూపర్ స్టార్స్ అయిన నాయికలూ ఉన్నారు. ఏదైనా ఫేట్ అంతే.

బంగర్రాజులో పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అని సాగే పాటలో నాగార్జున ఫరియా స్టెప్పులు వేయబోతున్నారు. ఈ పాట టీజర్ ను డిసెంబర్ 17న విడుదల చేస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతోన్న ఈ ‘బంగార్రాజు’ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ ప్లాన్ చేస్తున్నారు.

Related Posts