లైగర్ రివ్యూ


తారాగణం : విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణన్, రోనిత్ రాయ్, చుంకీ పాండే, అలీ, గెటప్ శ్రీను, స్పెషల్ రోల్ లో మైక్ టైసన్..
ఎడిటింగ్ :జునైద్ సిద్ధిఖీ
సినిమాటోగ్రఫీ: విష్ణు వర్మ
నేపథ్య సంగీతం :సునిల్ కశ్యప్
పాటలు : విక్రమ్ మోన్ ట్రోస్, తనిష్క్ బాగ్చీ
నిర్మాతలు :పూరీ జగన్నాథ్, ఛార్మీ, కరణ్‌ జోహార్
దర్శకత్వం : పూరీ జగన్నాథ్

కొన్ని సినిమాలు బలే అంచనాలు పెంచుతాయి. ఏదో అద్భుతం చూడబోతున్నాం అనే ఫీలింగ్ ను ఇస్తాయి. అందుకు ఫస్ట్ రీజన్ కాంబినేషన్ అయితే.. నెక్ట్స్ రీజన్ ప్రమోషన్స్. ఈ రెండు అంశాల్లోనూ హైప్ తెచ్చుకుని ఎక్స్ పెక్టేషన్స్ ను పెంచిన సినిమా లైగర్. సాలా క్రాస్ బ్రీడ్ అనే తన మార్క్ ట్యాగ్ లైన్ కూడా పెట్టాడు పూరీ. అతని రీసెంట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ కావడంతో మనోడు మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు అనుకున్నారు. ఇటు సినిమాపై అంచనాలను పెంచడంతో లైగర్ కూడా పెద్ద విజయం సాధిస్తుందనుకున్నారు. మరి ఈ మూవీ ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ను రీచ్ అయిందా లేదా అనేది చూద్దాం.

లైగర్.. చిన్నప్పటి నుంచి పెద్ద మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ కావాలని కలలు కంటాడు. అతన్ని ఆ దిశగానే పెంచుతుంది తల్లి. పైగా అతని తండ్రి కూడా ఫైటరే. బాక్సింగ్ రింగ్ లోనే చనిపోతాడు. నేషనల్ చాంపియన్ కావాలన్న తన భర్త కలను కొడుకు ద్వారా నెరవేర్చుకోవాలని అతన్ని మంచి ట్రెయినింగ్ కోసం ముంబై తీసుకువస్తుంది. అక్కడ చాయ్ బండి నడుపుతూ ఓ మంచి కోచ్ వద్ద చేరుస్తుంది. ట్రెయినింగ్ తీసుకుంటూనే తాన్యా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. లైగర్ కు నత్తి ఉంటుంది. మొదట దానివల్ల తనకేం ఇబ్బంది లేదని చెప్పిన తాన్యా.. అలా చెప్పినప్పుడు తను మత్తులో ఉన్నానని.. నత్తివాళ్లను నేను ప్రేమించను అని వెళ్లిపోతుంది. ప్రేమలో విఫలం అయిన కసిని రింగ్ లో చూపించి లైగర్ నేషనల్ ఛాంప్ అవుతాడు. తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ కు వెళ్లాలనుకుంటాడు. ఇండియా నుంచి అప్పటి వరకూ ఎమ్ఎమ్ఏ కు ఎవరూ వెళ్లకపోవడంతో ప్రభుత్వం నో చెబుతుంది. మరి లైగర్ ఇంటర్నేషనల్ ఎమ్ఎమ్ఏ పోటీలకు వెళ్లాడా.. వెళితే ఎలా వెళ్లాడు.. ? తన లవ్ స్టోరీ ఏమైందీ అనేది మిగతా కథ.

ఏ కథకైనా ఓ నిర్మాణం ఉంటుంది. ఆ నిర్మాణమే స్క్రీన్ ప్లే. అది లోపించినప్పుడు ఎన్ని హైలెట్స్ ఉన్నా.. మైనస్ లుగానే కనిపిస్తాయి. ఫైటర్ కాబట్టి తెరంతా ఫైట్స్ తో నింపేస్తే సినిమా పాస్ అయిపోదు కదా..? ఆ ఫైట్ కు ముందో, వెనకో బలమైన ఎమోషన్ ఉండాలి. ఆ ఎమోషన్ ఆడియన్స్ కు కనెక్ట్ కావాలి. అప్పుడే ఆకట్టుకుంటుంది. తను గెలవాలనే కోరిక ప్రేక్షకుల్లోనూ కలుగుతుంది. ఇవేవీ కనిపించని కథ లైగర్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న సినిమాల్లో ఎలాగైనా హీరోనే గెలుస్తాడు అని అందరికీ తెలుసు. ఆ గెలుపు కోసం అతను పడే స్ట్రగుల్ ఇంపార్టెంట్. ఇదే ఎమోషన్ అంటే. ఈ ఎమోషన్స్ ను ఆడియన్స్ కు కనెక్ట్ చేయడంలో పూరీ జగన్నాథ్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఫైటర్ కావాలన్న హీరో కోరికకు సరైన లీడ్ లేదు. కేవలం డైలాగ్స్ లో అతని తండ్రి బాక్సింగ్ రింగ్ లోనే చంపేశాడనీ.. నేషనల్ చాంపియన్ కావాలన్న అతని కోరికను కొడుకు ద్వారా నెరవేర్చుకునేందుకే తను ముంబై వచ్చానని హీరో తల్లి చెబుతుంది. అతని ఫైటింగ్ కోచ్ కోసం రీసెంట్ గా వచ్చిన గని సినిమాలోని హీరో ఫాదర్ ఫైటింగ్ ఎపిసోడ్ ను ఎత్తేశారు.

ఏ మాత్రం కొత్తదనం లేని ఫస్ట్ హాఫ్ ను లవ్ ఫెయిల్యూర్ వద్ద ముగించాడు. ఓ వైపు ప్రపంచం అంతా అద్భుతమైన కథలు చెబుతోంటే.. ఇంకా నలుగురుని కొట్టిన హీరోను చూసి ప్రేమలో పడే హీరోయిన్ దగ్గరే ఆగిపోయాడు పూరీ జగన్నాథ్. ఈ ప్రేమకథ, లైగర్ ఫైటింగ్ నేర్చుకోవాలన్న కోరిక రెండూ అసంబద్ధంగానే ఉంటాయి. ఇక సెకండ్ హాఫ్ అతను రింగ్ లో గెలవడం అనేది చాలా సులువుగా ఊహించగలిగే కథనం. లైగర్ టైటిల్ కు జస్టిఫికేషన్ లేదు. స్టోరీ టేకాఫే బాలేదు. టేకింగ్ నుంచి ఫైట్స్ లోని టెక్నిక్స్ వరకూ సాదాసీదాగా కనిపిస్తాయి.మైక్ టైసన్ కూడా ఉన్నాడు అంటే ఏదో ఊహించినవారికి తలబొప్పి కట్టే క్లైమాక్స్ చూపించి తనలో పస అయిపోయిందనే విషయం చెప్పకనే చెప్పాడు పూరీ. అమ్మానాన్నా ఓ తమిళ అమ్మాయిలో హీరో చెల్లి విలన్ కు పడితే ఇందులో విలన్ లాంటి వ్యక్తి చెల్లి హీరోకు పడిపోతుంది. ఇలాంటివి బలమైన కథలుంటే చెల్లిపోతాయి. అయినా ఆ కాలం చెల్లిన కంటెంట్స్ తోనే కథనం నడిపిస్తే బాక్సాఫీస్ రింగ్ లో నాకౌట్ అయిపోతారు. ఇప్పుడు పూరీ పరిస్థితి ఇదే అని చెప్పొచ్చు.

ఇక ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డాడు విజయ్ దేవరకొండ. అతని కష్టం తెరపై కనిపిస్తున్నా.. సినిమాలో మేటర్ లేనప్పుడు ఇవన్నీ వేస్ట్ అవుతాయి కదా. అనన్య పాండే ఓకే. రమ్యకృష్ణ పాత్రతో తన పాడ్ కాస్ట్ డైలాగ్స్ చెప్పించాడు దర్శకుడు. కొన్నిసార్లు ఇరిటేట్ చేస్తుంది కూడా. కోచ్ పాత్రలో రోనిత్ రాయ్ ది రొటీన్ రోల్. అలీ జస్ట్ ఓకే. ఫస్ట్ హాఫ్ లో లైగర్ అపోనెంట్ గా కనిపించిన విష్ దీ రొటీన్ పాత్రే. టెక్నికల్ గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ బావుంది. ఫైట్స్ అస్సలు బాలేదు. పాటలు ఒక్కటీ రిజిస్టర్ కాదు. పైగా ప్లేస్ మెంట్ కూడా సరిగా లేదు. ఓవరాల్ గా ఎక్స్ పెక్టేషన్స్ ను రీచ్ కావడం కష్టం అనే చెప్పాలి.

ఫైనల్ గా ః సాలా నాకౌట్

రేటింగ్ : 2/5

Related Posts