చిరంజీవి మూవీ ‘భోళా శంకర్’ ఏప్రిల్ 14, 2023న విడుదల

మెగాస్టార్ చిరంజీవి- స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “’భోళా శంకర్”. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం విడుదల తేది ఖరారైయింది. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 14, 2023న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.రిలీజ్ డే ‘శుక్రవారం’ అంబేద్కర్ జయంతి పబ్లిక్ హాలీడే. దాని తర్వాత వీకెండ్ సెలవులు వస్తాయి. అంటే బాక్సాఫీస్‌ వద్ద మూడు రోజుల పాటు మెగా ర్యాంపేజ్‌ ఖాయం. రేపు(ఆగస్టు22) మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘భోళా శంకర్’ బ్రాండ్ న్యూ పోస్టర్‌ను విడుదల చేస్తూ ప్రకటన చేశారు.

పోస్టర్‌లో చిరంజీవి స్టైలిష్ గా నడుస్తూ ట్రైడెంట్ కీచైన్‌ ని తిప్పుతూ మెగా స్తయిలీష్ గా కనిపించారు. హీరోలని స్టైలిష్ గా ప్రజంట్ చేయడంలో పేరు తెచ్చుకున్న మెహర్ రమేష్ .. ట్రెండీ కాస్ట్యూమ్స్ , కళ్ళద్దాలతో మెగాస్టార్‌ ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టు మెగాస్టార్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. మెగాస్టార్ వింటేజ్ స్వాగ్, మెహర్ రమేష్ స్టైల్‌.. రానున్న సమ్మర్‌లో అభిమానులకు పండగలా ఉంటుందని చెప్పాలి. భోలా శంకర్ ఇప్పటివరకు 40శాతం పూర్తయింది. అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పై ఈ భారీ బడ్జెట్ చిత్రం ప్రతిష్టాత్మకంగా తతెరకెక్కుతోంది.ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తుండగా, డాజ్లింగ్ బ్యూటీ తమన్నా మరో ప్రధాన పాత్రలో కనిపించనుంది.

క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించగా, డూడ్లే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షకుడిగా, తిరుపతి మామిడాల డైలాగ్ రైటర్ గా , మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

తారాగణం: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శీను తదితరులు.

సాంకేతిక విభాగం:
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
బ్యానర్: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిషోర్ గరికిపాటి
సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ: డూడ్లే
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
కథా పర్యవేక్షణ: సత్యానంద్
డైలాగ్స్: తిరుపతి మామిడాల
ఫైట్ మాస్టర్స్: రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, కాచే కంపాక్డీ
కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, సిరాశ్రీ
పీఆర్వో : వంశీ-శేఖర్
వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: యుగంధర్
పబ్లిసిటీ డిజైనర్లు: అనిల్-భాను
డిజిటల్ మీడియా హెడ్: విశ్వ సీఎం
లైన్ ప్రొడక్షన్: మెహెర్ క్రియేషన్స్

Related Posts