బ్యూటీఫుల్ సాంగ్ మేజర్

తెలుగు సినిమాల్లో ఈ మధ్య వచ్చే పాటలు అద్భుతంగా ఉంటున్నాయి. అన్ని పాటలూ కాదు కానీ.. ఒక్కోసారి ఒక్క పాటే మెస్మరైజింగ్ చేసేలా ఉంటున్నాయి. ముఖ్యంగా మాంటేజ్ సాంగ్స్ విషయంలో మనవాళ్ల టేస్ట్ అద్భుతంగా ఉంటోంది. సంగీతం, సాహిత్యం నుంచి మేకింగ్ వరకూ మెప్పిస్తున్నారు. అలాంటిదే ఇప్పుడు మేజర్ చిత్రం నుంచి వచ్చిన పాట. అడవి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సెమీ బయోపిక్ నుంచి ఓ ఇషా ఓ ఇషా అనే బ్యూటీఫుల్ సాంగ్ ను విడుదల చేశారు. ఇప్పుడు వస్తోన్న ట్రెండ్ కు భిన్నంగా పూర్తి వీడియో సాంగ్ విడుదల చేయడంతో పాటతో పాటు విజువల్ కూడా కట్టిపడేలా ఉంది. మేజర్ సందీప్ ఉన్నకృష్ణన్ లైఫ్ స్టోరీ ఆధారంగా వస్తోన్న ఈ చిత్రంలోని ఈ పాట సందీప్ లవ్ స్టోరీ బిగెనింగ్ నుంచి పెళ్లి వరకూ సాగేలా ఉంది. అందుకు తగ్గట్టుగానే వీరి ప్రేమకథ మొదలైన విధానం నుంచి పెళ్లి వరకూ వచ్చిన క్రమాన్ని అద్భుతమైన మాంటేజ్ గా చేశారు. అలాగే పాటలోనే ఆమె అతనికి ఫోన్ నెంబర్ చెప్పిన విధానం అద్భుతం అనేలా ఉంది. మరో విశేషం ఏంటంటే.. శేష్ తో పాటు హీరోయిన్ గా నటించిన సాయీ మంజ్రేకర్ కూడా చాలాచాలా బావుంది. వీరి పెయిర్ కూడా ఫ్రెష్ గా కనిపిస్తోంది.

శ్రీ చరణ్ పాకాల సంగీతం అదించిన ఈ చిత్రంలోని ఈ పాటను రాజీవ్ భరద్వాజ్ రాశాడు. అర్మన్ మాలిక్, చిన్మయి శ్రీపాద ఆలపించారు. మొత్తంగా మేజర్ పై ఇప్పటికే ప్యాన్ ఇండియన్ రేంజ్ లో భారీ అంచనాలున్నాయి.ఈ పాట మరింతగా అంచనాలను పెంచుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ముంబైలోనితాజ్ హోటెల్ లో జరిగిన 26/11 అటాక్స్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ జూన్ 3న దేశవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఏదేమైనా పాట మాత్రం అద్దిరిపోయింది మేజర్..

Related Posts