సర్కారు వారి పాట హిట్టు.. మరి పరశురామ్..?

ఒక సినిమా విజయం సాధిస్తే మేజర్ షేర్ హీరో అకౌంట్ లో పడుతుంది. పోతే డైరెక్టర్ ను అంటారు. కానీ ఈ సారి సినిమా హిట్ అయినా.. డైరెక్టర్ నే అంటున్నారు. అందుకు కారణం ఏంటో సర్కారువారి పాట చూసిన అందరికీ తెలుసు. ఈ సినిమాపై మహేష్ బాబు చాలా అంచనాలు పెట్టుకున్నాడు. కానీ వాటిని అందుకుందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. పైగా ఈ చిత్రానికి వేస్తోన్న కలెక్షన్స్ అన్నీ ఫేక్ అని ఊరంతా సోషల్ మీడియా అయి కూస్తోంది. చాలా వరకూ అవన్నీ ఫేక్ కలెక్షన్సే అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంలో మహేష్ బాబు మహా సంతోషంగా ఉన్నాడని మొన్న కర్నూల్ లో వేసిన స్టెప్పులు చెప్పాయి. అంటే సినిమా సూపర్ హిట్అయిపోయిందని సూపర్ స్టార్ బలంగా నమ్మేస్తున్నాడు అనుకోవచ్చు. కానీ బయట విషయం వేరే కదా. అది మహేష్ కు తెలియకపోయినా మరో హీరోకు తెలుస్తుంది కదా.. అంటే మేటర్ పరశురామ్ వైపు నుంచి కనిపిస్తుంది.

యస్.. మహేష్ బాబు లాంటి టాప్ హీరో ఛాన్స్ ఇస్తే పరశురామ్ దాన్ని చేజేతులా పాడు చేసుకున్నాడని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు. ఫైనల్ అవుట్ పుట్ చూసుకున్న తర్వాతైనా మినిమం మిస్టేక్స్ ను కూడా సరి చేసుకోలేదు. పైగా ఇవేమీ రీ షూట్ కు సంబంధించినవి కాదు. కేవలం ఎడిటింగ్ లో తీసేయొచ్చు. అయినా పరశురామ్ వాటిని వదిలేశాడు. ఎంటర్టైన్మెంట్ పేరుతో ఫస్ట్ హాఫ్ అంతా వృథా చేసుకున్నాడు. అలాగని అంతా సీరియస్ గా ఉండాలని కాదు. కానీ అసలు కథకు ఉపకథలను ఫస్ట్ హాఫ్ లోనూ చెప్పొచ్చు అని మినిమం సినిమా నాలెడ్జ్ ఎవరికైనా అర్థం అవుతుంది. ఈ విషయంలో పరశురామ్ ఫెయిల్ అయ్యాడు. అలాగే ఇంత సీరియస్ సబ్జెక్ట్ ను చెబుతున్నప్పుడు మినిమం హోమ్ వర్క్ చేయాలి. అవేవీ లేకుండా అంతా తను అనుకున్నట్టుగానే ఉండాలి అని భావించినట్టుగా తీశాడు తప్ప.. ఓ బ్యాంక్ కు ఎంత లోన్ ఇచ్చే పరిధి ఉంటుంది.. పరిధులు దాటినప్పుడు ఆ లోన్ ఎవరి సమక్షంలో ఇవ్వబడుతుంది.. అప్పుడు దానికి బాధ్యత ఎవరు తీసుకోవాలి అనే అంశాలు చాలా పెద్దవి. వీటిని వదిలేశాడు. లేదా అతనికి అసలు తెలియదు అనుకోవచ్చు.

సింపుల్ గా చెబితే ఈ అవకాశాన్ని పరశురామ్ పాడుచేసుకున్నాడు. తర్వాత అతనికి మరో స్టార్ హీరో ఛాన్స్ ఇస్తాడు అనుకోలేం. కేవలం మీడియం రేంజ్ హీరోల వరకే పరశురామ్ ప్రతిభ సరిపోతుంది తప్ప.. టాప్ స్టార్స్ ను హ్యాండిల్ చేసేంత సత్తా అతని పెన్ లో లేదని సర్కారువారి పాట చూసిన ఏ స్టార్ అయినా ఒప్పుకుని తీరతాడు. �