నవీన్ పోలిశెట్టిని ఫాలో అవుతున్న నాని

తెలుగు సినిమాలకు.. ఆంధ్రా, సీడెడ్, నైజాం, కర్ణాటకలతో పాటు ఓవర్సీస్ కూడా అతిపెద్ద మార్కెట్. కోవిడ్ కి ముందు టాలీవుడ్ లో చాలా సినిమాలు ఓవర్సీస్ లో మిలియన్ల డాలర్స్ ను కొల్లగొట్టాయి. కోవిడ్ తర్వాత కొంతకాలం పాటు స్లో అయిన ఓవర్సీస్ మార్కెట్ మళ్లీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఈనేపథ్యంలోనే.. ఆ మార్కెట్ పై మళ్లీ స్పెషల్ ఫోకస్ పెట్టారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ ప్రత్యేకంగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఆమధ్య ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాకోసం హీరో నవీన్ పోలిశెట్టి అమెరికాలో అదిరిపోయే పబ్లిసిటీ చేశాడు. అది ఫలించింది కూడా. ఇప్పుడు నవీన్ బాటలోనే నేచురల్ స్టార్ నాని కూడా ఓవర్సీస్ ప్రమోషన్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాడట. ‘హాయ్ నాన్న’ సినిమాకోసం ఇప్పటికే ఇక్కడ ప్రచారంలో దూకుడు పెంచిన నాని.. అమెరికాలోనూ ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట. గతంలో నాని నటించిన పలు సినిమాలు ఓవర్సీస్ లో అద్భుతమైన వసూళ్లు సాధించాయి.

Related Posts