‘సలార్’ ర్యాంపేజ్ కి నెల రోజులు మాత్రమే

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి ఫ్యాన్స్ ఎలాంటి సినిమా అయితే ఎక్స్ పెక్ట్ చేస్తారో అలాంటి ఊరమాస్ ఎంటర్ టైనర్ ‘సలార్’. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న అసలుసిసలు యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్శ్ నుంచి రాబోతున్న ‘సలార్ సీజ్ ఫైర్’ విడుదలకు ఇంకా కేవలం నెల రోజులు మాత్రమే ఉంది. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 22న ‘సలార్ సీజ్ ఫైర్’ గ్లోబల్ లెవెల్ లో గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతుంది.

ఈనేపథ్యంలో ‘సలార్ ర్యాంపేజ్ ఇన్ ఎ మంత్’ అంటూ టీమ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. మరో పది రోజుల్లో ‘సలార్ సీజ్ ఫైర్’ ట్రైలర్ రాబోతుంది.’కె.జి.యఫ్’కి పది రెట్లు ఉండేలా ఈ సినిమాని తీర్చిదిద్దాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇక.. ట్రైలర్ రిలీజ్ నుంచి ‘సలార్ సీజ్ ఫైర్’ ప్రచారానికి శ్రీకారం చుట్టనుందట టీమ్. మరోవైపు ఈరోజు నుంచి నార్త్ అమెరికాలో ‘సలార్ సీజ్ ఫైర్’ బుకింగ్స్ కూడా మొదలవుతున్నాయి.

Related Posts