బాలయ్య అభిమానులు ఇలాగే ఉంటారు..

నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎలా ఉంటారో ఇప్పటికే పలు సందర్భాలలో చూశాము. ఇప్పుడు మరొకరు బాలయ్యపైన ఉన్న తన అభిమానాన్ని చాటుకున్నాడు. కేరళలోని ఒక స్టీల్ షాప్ యజమాని మన బాలయ్య మీద ఉన్న అభిమానాన్ని ఇలా చూపించుకున్నాడు.

తన స్టీల్ షాపుకి ‘వీర సింహారెడ్డి’ మూవీలోని బాలయ్య స్టిల్ ని హోర్డింగ్‌గా పెట్టుకున్నాడు. అలాగే, బ్యానర్ లో కూడా బాలయ్య ఫొటోను పెట్టాడు. అంతేకాదు, అయ్యప్ప మాలలో ఉన్న అభిమాని చేతిలో కత్తిపట్టుకొని బాలయ్య హోర్డింగ్ పక్కన నిలుచుని వీర లెవల్‌లో ఫోజిచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, బాలయ్య ఇటీవల ‘భగవంత్ కేసరి’ సినిమాతో భారీ అందుకున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఆయన 109వ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి విడుదల చేసిన లుక్ నందమూరి అభిమానులనే కాక ప్రేక్షకులందరినీ విపరీతంగా ఆకట్టుకుంది.

Related Posts