రామ్ చరణ్‌ ట్వీట్ పై రచ్చ

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డ్ రావడం పట్ల మెగా ఫ్యామిలీలో అందరూ హ్యాపీగా ఉన్నారా అంటే లేదు అనే చెబుతున్నారు చాలామంది. ఇన్నాళ్లుగా సినిమాలు చేస్తున్నా.. రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాల్లో అద్భుత నటన చూపించినా రాని నేషనల్ అవార్డ్ అల్లు అర్జున్ కు రావడం పట్ల రామ్ చరణ్ జెలసీగా ఉన్నాడా అంటూ రకరకాల మాటలు మాట్లాడుకుంటున్నారు.

అందుకు ప్రధాన కారణాలుగా రెండు అంశాలు చూపిస్తున్నారు. మొదటిది ఏమో కానీ.. రెండోది చూస్తే నిజమేనా అనిపించక మానదు. అల్లు అర్జున్ కు గురువారం సాయంత్రం నేషనల్ అవార్డ్ అనౌన్స్ అయింది. రామ్ చరణ్ మాత్రం శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత గ్రీటింగ్స్ పంపించాడు. అయితే ఈ గ్రీటింగ్ అల్లు అర్జున్ కు పర్సనల్ గా కాక.. అందరికీ కలిపి గుంపుగా చెప్పాడు. అయితే ఈ గుంపు అనౌన్స్ మెంట్ లో కూడా అల్లు అర్జున్ పేరును వైష్ణవ్ తేజ్ తర్వాత చేర్చడంపై బన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇది అల్లు అర్జున్ పై జెలసీతోనే చేసిన పని అంటూ ఫ్యాన్ వార్ స్టార్ట్ చేశారు. రామ్ చరణ్ ట్వీట్ చూస్తే..


” ఇది గర్వంగా ఫీలయ్యే తరుణం. 69వ నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్నవాళ్లంతా నాకు ఇష్టమైన వాళ్లు. దగ్గరవాళ్లు.. హార్టీ కంగ్రాట్యులేషన్స్ టు
6 అవార్డులు గెలుచుకున్న టీమ్ ఆర్ఆర్ఆర్ అండ్ విజినరీ ఎస్ఎస్ రాజమౌళి గారు
ఎమ్ఎమ్ కీరవాణి గారు
ప్రేమ్ రక్షిత్
కాలభైరవ, శ్రీనివాస్ మోహన్, కింగ్ సోలోమన్, డివివి ఎంటర్టైన్మెంట్స్, డివివి దానయ్య గారు.. ఇదంతా మర్చిపోలేని ప్రయాణం.

ఉప్పెన సాధించిన విజయానికి నా సోదరుడు వైష్ణవ్ తేజ్ నా మరో సోదరుడు బుచ్చిబాబు సానాకు

డబుల్ చీర్స్ ఫర్ టీమ్ పుష్ప, మై బ్రదర్ అల్లు అర్జున్ అండ్ డిఎస్పీ

మై డియరెస్ట్ కో స్టార్ అలియా భట్ ఫర్ గంగూభాయ్ ..
భారతీయ సినిమాను గర్వించేలా చేసిన విజేతలందరికీ శుభాకాంక్షలు.. “

ఇదీ రామ్ చరణ్‌ ట్వీట్. ఇది చూస్తే ఎవరికైనా అతను అల్లు అర్జున్ విజయం పట్ల ప్రత్యేక ఆనందం కనబరచలేదు అనే అనిపిస్తుంది. అందుకే అల్లు అర్జున్.. ఎన్టీఆర్ ట్వీట్ ను ” జెన్యూన్” అన్నాడు అని గుర్తు చేసుకుంటున్నారు. నిజానికి రామ్ చరణ్‌ మెన్షన్ చేసింది కూడా తప్పే. ఏ అవార్డ్స్ అయినా ముందు బెస్ట్ యాక్టర్స్ నుంచే లిస్ట్ మొదలవుతుంది. అలా చూసినా అల్లు అర్జున్ పేరు ముందే చెప్పి ఉండాల్సింది. మరీ దారుణంగా వైష్ణవ్ తేజ్, బుచ్చిబాబు తర్వాత చేర్చడం చూస్తే చరణ్ ఫ్యాన్స్ కూడా ఇలాగే ఫీలవుతారేమో.


మొత్తంగా చరణ్ ట్వీట్ తర్వాత ఇప్పుడు మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ స్టార్ట్ అయింది. మాటల యుద్ధం నడుస్తోంది. రామ్ చరణ్ కు రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వంటి గ్రేట్ పర్ఫార్మెన్స్ ఉన్న సినిమాలు రెండున్నాయి. అల్లు అర్జున్ కు అవేం లేవు. మాకు ఇవి చాలు. మా హీరోనే గొప్ప.. కాదు మా హీరోనే గొప్ప అంటూ మాటలు దాటి బూతుల వరకూ వెళ్లి అటుపై వారి ఫ్యామిలీ మెంబర్స్ వరకూ వెళుతున్నారు. ఇవన్నీ చూస్తే వీళ్లు మారరు అనే పాత మాటే గుర్తు చేసుకుంటాం. బట్ రామ్ చరణ్‌ ట్వీట్ మాత్రం కొత్త రచ్చకు దారి తీసిందనే చెప్పాలి.

Related Posts