బెదురులంక 2012 ట్రైలర్

కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా బెదురులంక. క్లాక్స్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ముప్పానేని రవీంద్ర బెనర్జీ నిర్మించాడు. మణిశర్మ సంగీతం అందించాడు. ఇప్పటికే వచ్చిన టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే పాటలు ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రామ్ చరణ్‌ చేతుల మీదుగా విడుదల చేశారు. నిజానికి 2012లోని యుగాంతం అనే పుకారు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ప్రభావాన్ని చూపించింది.

యుగాంతం ఎలా జరుగుతుంది.. ఏ రూపంలో ఈ యుగం అంతం కాబోతోందీ అంటూ హాలీవుడ్ లో అనేక సినిమాలు కూడా వచ్చాయి. ఓ రకంగా మన దగ్గర కాస్త తక్కువ. ఉన్నంతలో కమల్ హాసన్ దశావతారం మాత్రం ఆ యుగాంతాన్ని ఇలా ఆపాం అనేలా కనిపించింది. అయితే ఈ పుకారును జనం లైట్ తీసుకుని చాలాకాలం అయింది. అయినా ఇప్పుడు అదే నేపథ్యంలో బెదురులంక సినిమా వస్తుండటం కొంత ఆశ్చర్యమే అయినా.. ట్రైలర్ చూస్తే ఆ పాయింట్ చుట్టూ అల్లుకున్న కథనం, వినోదంతో పాటు కొంత అవేర్ నెస్ ను కూడా తెచ్చే ప్రయత్నం చేసింది అనిపిస్తోంది. ఈ ట్రైలర్ లోని చాలా విజువల్స్ ఆల్రెడీ టీజర్ లో ఉన్నవే కావడంతో కథ మరీ ఎలివేట్ కాలేదు.

యగాంతాన్ని ఆపుతాం అంటూ కొందరు మతాన్ని అడ్డుపెట్టుకుని చేసిన ఆగడాలు, సంపాదన, అరాచకాల నుంచి ఆ ఊరిని ఓ కుర్రాడు ఎలా కాపాడాడు అనేది సినిమాగా కనిపిస్తోంది. అయితే ట్రైలర్ లోని చివరి సగం మాత్రం కాస్త కొత్తగా ఉంది.

ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇంకేదో కొత్త ఎలిమెంట్ కూడా యాడ్ అయినట్టు కనిపిస్తోంది. కార్తికేయ, నేహాశెట్టిల మధ్య మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అయినట్టుగా.. ఇతర కీలక పాత్రలు చేసిన అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, రాజ్ కుమార్, ఆటో రామ్ ప్రసాద్ వంటి వారి పాత్రలు కూడా కావాల్సినంత వినోదం పంచబోతున్నాని అర్థం అవుతోంది. మొత్తంగా ఈ నెల 25న విడుదల కాబోతోన్న బెదురులంక 2012 హీరో కార్తికేయకు అత్యంత కీలకంగా ఉంటుందని మాత్రం చెప్పాలి.

Related Posts