సమరసింహారెడ్డి పాటకు స్టెప్పులు కూడా నేనే చెప్పాను..

మణిశర్మ.. డౌట్ లేకుండా ఒక తరం చూసిన గ్రేట్ మ్యూజీషియన్. ఆ టైమ్ లో అప్పుడప్పుడే అప్ కమింగ్ అనిపించుకుంటున్న ఇప్పటి టాప్ హీరోలందరికీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే అప్పటికే టాప్ లో ఉన్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ లాంటి వారికి కెరీర్ బెస్ట్ ఆల్బమ్స్ తో పాటు ఆర్ఆర్ లు కూడా ఇచ్చాడు. అందుకే ఆయన్ని మెలోడీ బ్రహ్మ అన్నారు. ఒక దశాబ్దం పాటు తెలుగు సినిమా సంగీతాన్ని శాసించాడు అంటే డౌటే లేదు.

ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ విషయంలో మణిశర్మ సంగీతం యాక్షన్ సినిమాల్లో అయితే ఆ సినిమాల స్థాయిని పెంచిందనేది నిజం. అలాంటి సంగీత దర్శకుడు కొంతకాలంగా కాస్త వెనకబడ్డాడు. అఫ్‌ కోర్స్ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఒక్కరి హవానే నడవదు. అది అందరికీ వర్తిస్తుంది. ప్రస్తుతం తన వద్దకు వచ్చిన అన్ని సినిమాలనూ చేస్తున్నారు మణిశర్మ. అలా చేసిన సినిమా కార్తికేయ నటించిన బెదురులంక 2012.

ఈ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మణిశర్మ కూడా పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూ ప్రోమో విడుదల చేశారు. అది చూస్తే మామూలుగా బయట మాట్లాడ్డానికే పెద్దగా ఇష్టపడని ఆయన ఈ సారి ఓపెన్ హార్టెడ్ గా చేసిన కొన్ని కామెంట్స్ ఆశ్చర్యంతో పాటు నిజమే కదా అనే ఫీలింగ్ ను కూడా ఇస్తాయి.కార్తికేయ, దర్శకుడు క్లాక్స్ తో పాటు మణిశర్మ ఈ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా కార్తికేయతో పాటు దర్శకుడు అడిగిన కొన్ని ప్రశ్నలకు హానెస్ట్ గా జవాబులు ఇచ్చాడు అనిపిస్తుంది. ఏ హీరోకు తగ్గట్టు ఆ సంగీతం చేసిన స్పెషాలిటీ మీ ఒక్కరిదే అన్నాడు. దర్శకుడు మీరు మ్యూజిక్ చేస్తున్నప్పుడు హీరోలు డ్యాన్స్ చేయడం ముందే కనిపిస్తుంది కదా అంటే.. ‘సమర సింహారెడ్డి’లో అందాల ఆడబొమ్మ డ్యాన్స్ లు కూడా నేనే చూపించాను. ఇలా చేస్తే బావుంటుందని చెప్పాను అన్నాడు. కొన్ని సాంగ్ లు ఒక్కసారి వినంగానే ఎక్కేస్తుంది. కొన్ని రెండు సార్లు వింటే ఎక్కుతుంది. కొన్నిసాగ్ లు పదిసార్లు వింటే నరాల్లోకి ఎక్కేస్తుంది.. అది మిస్ అవుతున్నారు ప్రేక్షకులు అన్నాడు.

అలాగే ఇప్పుడు పాటలకు సంబంధించి ‘వ్యూస్’ అనే దౌర్భాగ్యం ఒకటి చచ్చింది.. అన్నాడు. సోషల్ మీడియాలో లేరెందుకు అంటే.. ‘దానికి ఏదో ఒకటి వేస్తుండాలి.. ఫస్ట్ ఆఫ్‌ అవన్నీ లేకుండానే నన్ను ఇంత తిడుతున్నారు.. ” ఏదైనా పార్టీకి వెళితే నా పాట వేస్తే వెంటనే ఆపేయమంటా. పాట అయిపోయిన తర్వాత వినడం నాకు అస్సలు నచ్చదు.. ఇక నా కెరీర్ లో బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకే అనడం డౌటే లేదు. నేను కొన్ని బ్యాడ్ డెసిషన్స్ తీసుకున్నాను. దాని వల్ల ఇప్పుడేం బాధపడటం లేదు. ఒక్కడు సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ కంటే డబుల్ ఖర్చు అయింది.. తమిళ్ లో విజయ్ కి నేను ఇచ్చిన ఓపెనింగ్ సాంగ్స్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది.. జాతీయ స్థాయిలో రాణించలేకపోయాను అనే బాధ ఉంది.. అంటూ అనేక అంశాలను మనసు విప్పి పంచుకున్నట్టుగా ఉంది. ఈ ఇంటర్వ్యూ పై ఈ ప్రోమో మంచి హైప్ తెచ్చిందనే చెప్పాలి.

Related Posts