ఎన్టీఆర్ రూట్ లోనే రామ్ చరణ్

ఒక కథను పోలిన కథలు అనేకం ఉంటాయి. హీరోలు, దర్శకులు వేరు. కానీ కంటెంట్ పరంగా చూస్తున్నప్పుడు అవే రిపీట్ అవుతున్నాయా అనే ఫీలింగ్ ఆడియన్స్ కు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత దర్శకులదే. ప్రస్తుతం తెలుగులో బ్యాక్ డ్రాప్ మూవీస్ జోరు పెరుగుతోంది. ముఖ్యంగా సముద్రం నేపథ్యపు కథలు వరుసగా రాబోతున్నాయి.

ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో రూపొందుతోన్న దేవర ఈ నేపథ్యంలో వస్తోన్న కథే. సముద్రపు దొంగలు, సముద్రాన్ని అడ్డుపెట్టుకుని కొందరు అరాచకాలను ఎదురించే ఓ మొనగాడుగా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు అని ఇప్పటికే ఓ హింట్ ఇచ్చాడు కొరటాల శివ. ఈ సినిమా ఇద్దరికీ కీలకం అనే చెప్పాలి.

ఇక వీరితో పాటు నాగ చైతన్య – చందు మొండేటి కాంబినేషన్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చే సినిమా కూడా శ్రీకాకుళం సముద్ర జాలరుల నేపథ్యంలోనే వస్తోన్న కథ. ఈ కథకు చాలా పెద్ద స్పాన్ ఉందని మొదటి నుంచీ వినిపిస్తోంది. సముద్రలో బోట్ ను నడిపే ” తాండేల్” పాత్రలో చైతన్య నటించబోతున్నాడు అని చెబుతున్నారు. ఇది ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్.


ఇక లేటెస్ట్ గా వినిపిస్తున్నది ఏంటంటే.. తన ఫ్రెండ్ ఎన్టీఆర్ రూట్ లోనే రామ్ చరణ్ కూడా వెళుతున్నాడు. యస్.. బుచ్చిబాబు డైరెక్షన్ లో రూపొందబోతోన్న స్పోర్ట్స్ డ్రామా మూవీని కూడా సముద్రం నేపథ్యంలోనే రూపొందించబోతున్నారట. ఆల్రెడీ బుచ్చిబాబు ఉప్పెనతో ఆ నేపథ్యంలోనే సినిమా చేశాడు. ఇప్పుడు రామ్ చరణ్ ను కూడా సముద్ర జాలరిలా చూపించబోతున్నాడట. అంటే ఓ జాలరి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి స్పోర్ట్స్ లో అత్యున్నత స్థాయికి ఎలా వెళ్లాడు అనేది పాయింట్. ఈ పాయింట్ తో పాటు రామ్ చరణ్ కూడా తోడైతే.. మాస్ కు మంచి మూవీ అవుతుంది.

ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నాడు చరణ్. ఇది ఈ నవంబర్ లేదా జనవరి వరకూ పూర్తవుతుంది. ఆ తర్వాత బుచ్చిబాబు సినిమా రెగ్యులర్ షూటింగ్ కు వెళుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఫైనల్ చేశారు.


విశేషం ఏంటంటే.. సముద్ర నేపథ్యంలో సినిమాలు అంటే ఎగసిపడే అలలు, ఎదురొచ్చే తుఫాన్ ల తాకిడిని దాటే సన్నివేశాలు కంపల్సరీగా కనిపిస్తాయి. మరి ఈ మూడు సినిమాల్లోనూ ఆ సీన్స్ ఉంటే ఆడియన్స్ కు రిపీట్ అయిన ఫీలింగ్ రాకుండా ఎలా చూసుకుంటారా అనే ఆసక్తి కలుగుతోంది. ఏదేమైనా ఆర్ఆర్ఆర్ స్టార్స్ ఇద్దరూ సముద్రంలో పడుతున్నారన్నమాట.

Related Posts