ఇవాళే బ్రో ట్రైలర్

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న బ్రో మూవీ ట్రైలర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇవాళ సాయంత్రం 6.03 గంటలకు ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. ఇక ఉదయం నుంచే అభిమానుల ఎదురుచూపులు మొదలయ్యాయి. పవన్ కళ్యాణ్ దేవుడు పాత్రలో నటించిన ఈ సినిమాలో సాయితేజ్ ఓ కీలక పాత్ర చేశాడు. సముద్రఖని దర్శకత్వం చేసిన బ్రో కు తెలుగు వెర్షన్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ను త్రివిక్రమ్ అందించాడు. అందుకే ఈ మూవీపై ఆసక్తి పెరిగింది.

పైగా ఈ మూవీ కథ వినగానే పవన్ కళ్యాణ్ ను త్రివిక్రమ్ కేవలం పదినిమిషాల్లోనే ఒప్పించాడట. ఈ విషయం ఇంటర్వ్యూస్ లో చెబుతూ తెగ మురిసిపోతున్నాడు సముద్రఖని. దర్శకుడుగా సముద్రఖని తీసినవన్నీ మంచి సినిమాలే. ఏదో ఒక మెసేజ్ చెప్పాలని ప్రయత్నిస్తుంటాడు. అయితే ఈ కథ తనకు చాలా స్పెషల్ అంటూనే.. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాలంటున్నాడు.అందరికీ ఈ కథ చెప్పేందుకే అన్ని భాషల్లో తీయబోతున్నా అని ఆల్రెడీ చెప్పాడు సముద్రఖని. తమిళ్ లో ఎప్పుడో వినోదాయ సీతం గా వచ్చిన ఈ మూవీని ఇప్పుడు తెలుగులో బ్రో గా రీమేక్ చేశాడు. నెక్ట్స్ హిందీలో చేయబోతున్నాడు. ఆ తర్వాత కన్నడ, మళయాలంలో కూడా రూపొందిస్తాడట.


ఇక ఈ సినిమా గురించి దర్శకుడి గురించి సాయితేజ్ చెప్పింది వింటే ఖచ్చితంగా ఆసక్తి పెరుగుతుంది.ఇది బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ సినిమాలా ఉంటుందట. మొదటి సగం ఎంటర్టైనింగ్ గా .. రెండో సగం ఎమోషనల్ గా ఉంటుందని చెప్పాడు. అంటే ఈ మూవీలో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్స్ కూడా ఉంటాయన్నమాట. ఏదేమైనా మామా అల్లుళ్లు కలిసి నటించిన సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ లో బ్రో పై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ నెల 28న విడుదల కాబోతోన్న బ్రో.. ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Related Posts