ఆమె కథేంటీ..

క్రైమ్ థ్రిల్లర్స్ ను కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. కాకపోతే ఈ తరహా సినిమాలకు అన్ని వర్గాల ఆడియన్స్ అట్రాక్ట్ కారు. అయినా వారిని కూడా థియేటర్స్ కు రప్పించేంత గ్రిప్ సినిమాలో ఉంటే వచ్చేస్తారు. కొన్నాళ్లుగాతెలుగులో ఈ టైప్ మూవీస్ పెరుగుతున్నాయి. ఆ క్రమంలో వస్తోన్న మరో సినిమా ‘హర్’. తెలుగులో చిలసౌ సినిమాతో పరిచయమైన బ్యూటీ రుహానీ తర్వాత ‘హిట్’ ఫస్ట్ కేస్ మూవీలో నటించింది. డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు వంటి సినిమాలు ఆకట్టుకోలేదు. అయినా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అలరిస్తోన్న ఈ లేడీ ప్రధాన పాత్రలో నటించిన సినిమానే ఈ హర్. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.


రుహానీ శర్మ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తోంది. సిటీలో జరిగిన ఓ మర్డర్ వెనక ఉన్న వ్యక్తులను పట్టుకునే పాత్రలో ఆమె కనిపిస్తోంది. మామూలుగా క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ట్రైలర్స్ కూడా ఓ టెంప్లేట్ లోనే సాగుతాయి. ఇది కూడా అలాగే ఉంది.ఓ క్రూరమైన మర్డర్.. పోలీస్ ల ఎంట్రీ.. దీని వెనక ఎవరున్నారో కనుక్కునే ఇన్వెస్టిగేషన్. కొందరు అనుమానితులు.. చివరికి వాళ్లు కాదని తేలడం.. ఫైనల్ గా అసలు నిందితుడిని పట్టుకోవడం.

ఈ ఫార్మాట్ మారదు. అయినా ఆ ఫార్మాట్ ను ఎంత గ్రిప్పింగ్ గా చెప్పగలిగితే అంత బెటర్. ఈ ట్రైలర్ కాస్త గ్రిప్పింగ్ గానే ఉంది. కథ నుంచి డీవియేట్ అయ్యే ఒక్క సీన్ కూడా ట్రైలర్ లో కనిపించలేదు.
ఇక ఈ మధ్య వస్తోన్న ట్రెండ్ లోనే వీళ్లు కూడా ఈ చిత్రాన్ని డిఫరెంట్ చాప్టర్స్ గా చూపించబోతున్నట్టున్నారు. అందుకే ఈ చిత్రానికి ‘హర్’ చాప్టర్1 అని పెట్టారు. అంటే ఇంకా కొన్ని చాప్టర్స్ ఉన్నాయనే కదా. ఇక ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కాబోతోంది.

Related Posts