స్కంద గ్లింప్స్ .. నేను దిగితే మిగిలేదుండదు..

బోయపాటి శ్రీను – రామ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ టైటిల్ అనౌన్స్ అయింది. చెప్పినట్టుగానేచెప్పిన టైమ్ కు టైటిల్ తో పాటు ఓ వీడియో గ్లింప్స్ ను కూడా విడదల చేసింది టీమ్. ఈ ఇద్దరి కాంబినేషన్ అనౌన్స్ అయినప్పుడే అంతా ఆశ్చర్యపోయారు.

బోయపాటి లాంటి హై ఓల్టేజ్ డైరెక్టర్ రామ్ లాంటి సాఫ్ట్ ఇమేజ్ ఉన్న స్టార్ తో సినిమా అన్నప్పుడు కొంత వరకూ అంచనాలు కూడా వచ్చాయి. ఆ అంచనాలను రెట్టింపు చేసేలా ఉందీ గ్లింప్స్. ఇక టైటిల్ గా అంతా ఊహించినట్టుగానే ” స్కంద” అనే పెట్టారు. స్కంద అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఉన్న మరో పేరు. టైటిల్ తో పాటు ద అటాకర్ అనే క్యాప్షన్ కూడా ఉంది.


గ్లింప్స్ చూస్తే ఓ గుడిలో జరిగే ఫైట్ సీన్ లోనిది. గుడి దగ్గరే ఉన్న.. తటాకంలో రామ్ చేత కత్తి పట్టుకుని చుట్టూ వస్తోన్న విలన్స్ ను నరికేస్తున్న ఈ వీడియో కు తమన్ నేపథ్యం సంగీతం చూస్తే గూస్ బంప్స్ వచ్చేలా ఉంది. ” మీరు దిగితే ఊడేదుండదు.. నేను దిగితే మిగిలేదుండదు.. ” అంటూ రామ్ చెప్పిన డైలాగ్ చూస్తే రామ్ ను కూడా బోయపాటి ఒన్ మేన్ షో లానే చూపించబోతున్నాడు అనుకోవచ్చు.

మొత్తంగా ఈ కాంబినేషన్ నుంచి ఎంత మాస్ అయినా ఎక్స్ పెక్ట్ చేయొచ్చు అని ఈ గ్లింప్స్ తోనే చెప్పకనే చెప్పారు. ఇక రామ్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈచిత్రాన్ని సెప్టెంబర్ 15న విడుదల చేయబోతున్నారు.

ఫస్ట్ టైమ్ ఈ మూవీతో రామ్ ను ప్యాన్ ఇండియన్ మార్కెట్ లోకి ఎంటర్ చేయిస్తున్నాడు బోయపాటి. ఐదు భాషల్లో ఈ స్కంద విడుదల కాబోతోంది. అన్ని భాషల్లోనూ ఈ టైటిల్ ను మార్చాల్సిన అవసరం లేదు. స్కంద అంటే సుబ్రహ్మణ్య స్వామి అని అందరికీ తెలిసే ఉంటుంది. సో.. టైటిల్ కూడా కలిసొస్తుంది. మరి బాక్సాఫీస్ పై ఈ స్కందుడి ఎటాక్ ఎలా ఉంటుందో చూడాలి.

Related Posts