Kalyan ram : తమ్ముడి మాట జవదాటని అన్న

కుటుంబాల మధ్య గొడవలు రావడం కామన్. కానీ సెలబ్రిటీ ఫ్యామిలీస్ లో వచ్చే గొడవలు అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తాయి. కొందరికి అవి వినోదాన్ని పంచుతాయి కూడా. ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీలో ఈ తరహా పంచాయితీలే నడుస్తున్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగా సాగుతున్నాయీ గొడవలు. అందుకు కారణం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు కావడం విశేషం.

గత నెలలో విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల ముగింపు సభకు ఎన్టీఆర్ కు ఆహ్వానం అందినా రాలేదు అని నిర్వాహకులు చెప్పిన మాట. బట్ ఆహ్వానమే రాలేదు అని ఎన్టీఆర్ టీమ్ చెప్పిన వెర్షన్ విని ఉన్నాం. ఇక హైదరాబాలో జరిగిన సభకు ఎన్టీఆర్ కు ఆహ్వానం ఉన్నట్టు విజయవాడలోలాగా కాకుండా పబ్లిక్ మొత్తానికి తెలిసేలా చేశారు.అంటే అందరు హీరోలతో పాటు అతని పేరా ఓ ఫ్లెక్సీ కొట్టించి.. ఇతనూ వస్తున్నాడు అన్నట్టుగా చేశారు. కానీ ఆ రోజు తన బర్త్ డే కాబట్టి.. ముందే చేసుకున్న ప్లానింగ్స్ ప్రకారం రాలేను అని అతను లెటర్ పంపించాడు.

అయితే ఈ మొత్తంలో తమ్ముడి మాటను జవదాటకుండా ముందుకు నడుస్తున్నాడు కళ్యాణ్‌ రామ్. యస్.. తమ్ముడు వెళ్లకపోతే తనూ వెళ్లడం లేదు. తమ్ముడిని పిలవలేదు కాబట్టి తనూ రాను అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు.


నిజానికి బాలకృష్ణతో కళ్యాణ్‌ రామ్ కు మంచి రిలేషన్ ఉంది. కానీ ఎన్టీఆర్ తో ‘బంధం’బాగా బలపడిని తర్వాత కళ్యాణ్‌ రామ్ పూర్తిగా తమ్ముడినే ఫాలో అవుతున్నాడు. ముందు నుంచీ తారక్ ను నాన్న నాన్నా అని పిలవడం అలవాటు. అంత ప్రేమ ఉంది. ఆ ప్రేమ వల్లే తమ్ముడు లేని చోట తానుండలేను అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు అంటున్నారు.

మరోవైపు నందమూరి హరికృష్ణ మరణం తర్వాత తమ కుటుంబం పట్ల ఇతర నందమూరి కుటుంబం చూపిన ఆదరణ విషయంలో కూడా ఈ అన్నదమ్ములిద్దరికీ కోపం ఉందనే కామెంట్స్ కూడా ఉన్నాయి. ఏదేమైనా తాతగారి ఫంక్షన్ ను కూడా స్కిప్ చేసేలా ఎన్టీఆర్ ఎటు ఉంటే.. తనూ అటే అని కళ్యాణ్‌ రామ్ నిర్ణయం స్పష్టమైంది. మరి ఇది ఇప్పటి వరకేనా లేక రాబోయే రోజుల్లో కూడా అన్నదమ్ములిద్దరూ బాబాయ్ తో పాటు ఆ ఫ్యామిలీస్ లో జరిగే ఫంక్షన్స్ కు దూరంగా ఉంటారా అనేది చూడాలి.

Related Posts