83 మూవీ – రివ్యూ

రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకొణె, పంకజ్‌ త్రిపాఠి, తాహిర్‌ రాజ్, జీవా తదితరులు న‌టించిన చిత్రం 83. భారతదేశం తొలిసారి క్రికెట్‌లో ప్రపంచకప్‌ గెలిచిన సందర్భం.. క్రికెట్‌ అభిమానులకే కాదు.. ప్రతి ఒక్క భారతీయుడి గుండె ఉప్పొంగిపోయిన సంవత్సరం అది. అందుకనే ఆనాటి జ్ఞాప‌కాల‌ను తెర పై ఆవిష్క‌రించాల‌ని క‌బీర్ ఖాన్ 83 చిత్రాన్ని తెర‌కెక్కించారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్, ఫాంటమ్‌ ఫిల్మ్స్, విబ్రి మీడియా, కా ప్రొడక్షన్స్, నదియవాలా గ్రాండ్‌సన్‌ ఎంటర్‌టైన్‌మెంట్, కబీర్‌ఖాన్‌ ఫిల్మ్స్ సంయుక్తంగా 83 చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రం ఈరోజు అన‌గా డిసెంబ‌ర్ 24న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి.. 83 ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా..? లేదా..? అనేది చెప్పాలంటే.. ముందుగా క‌థ చెప్పాలి.

క‌థ

భార‌త క్రికెట్ చరిత్ర‌లో ఎప్పటికి మర్చిపోలేని సంవత్సరం 1983. భారత జట్టు ప్రపంచ కప్‌ పోటీల కోసం ఇంగ్లండ్‌ బయలుదేరడంతో కథ మొదలవుతుంది. జట్టు మీద ఉన్న తక్కువ అంచనాలను చూపిస్తూ.. సభ్యులను పరిచయం చేస్తూ.. ఎలాంటి బోరింగ్ సీన్స్ పెట్ట‌కుండా ప్రేక్ష‌కుల్ని డైరెక్ట్ గా కథలోకి దించేశాడు దర్శకుడు. 1983 టైమ్ లో ఇండియా వరల్డ్ కప్ ను గెలుచుకున్న క్రమాన్ని, ఆ క్రమంలో ఎదురుకున్న ఇబ్బందులు ఏంటి.? ప్రత్యర్థుల నుంచి వచ్చిన సవాళ్ళను ఎలా అధిగమించారు ? టీమ్ ఇండియా ఎలా కప్ గెలిచారు ? అలాగే కపిల్ దేవ్ జీవితం గమనం ఏమిటి ? అనేది మిగిలిన క‌థ‌.

ప్లస్ పాయింట్స్
రణ్‌వీర్‌సింగ్ న‌ట‌న‌
క‌థ‌, క‌థ‌నం
ద‌ర్శ‌క‌త్వం ప్ర‌తిభ‌
టెక్నిక‌ల్ టీమ్ వ‌ర్క్

మైన‌స్ పాయింట్స్
అక్క‌డ‌క్క‌డా డ్రమెటిక్ గా ఉండ‌డం
ర‌న్ టైమ్

విశ్లేష‌ణ

సినిమాలో ఎక్కడా రణ్‌వీర్‌సింగ్‌ కనిపించలేదు..ఆహార్యం, ఆటతీరు, ఎక్స్‌ప్రెషన్స్ ఇలా అన్నింటిలో రణ్‌వీర్‌.. కపిల్‌దేవ్‌ను అచ్చు గుద్దినట్లు దించేశాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. క్రికెట్ ఆడుతున్న‌ప్పుడు క‌పిల్ దేవే ఆడుతున్నాడా అనిపిస్తుంటుంది. దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు ర‌ణ‌వీర్ సింగ్ ఎంత‌లా ఆ పాత్ర‌లో లీన‌మై న‌టించాడో. ఇక‌
కపిల్‌ భార్య రోమి భాటియా పాత్రలో తక్కువ సమయమే కనిపించిన దీపికా పదుకొణె తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది. కృష్ణమాచారి శ్రీకాంత్‌ పాత్రలో నటించిన జీవా జీవించేశాడు. జట్టు మేనేజర్‌గా పంకజ్‌ త్రిపాఠి మరోసారి తనదైన నటనతో మెప్పించాడు.

ఫస్టాఫ్ మొత్తం అప్పటి ఇండియన్ క్రికెట్‌ కు ఎదురైనా అవమానాలను కష్టాలను ప్రస్తావిస్తూ ఎమోషనల్‌గా సాగింది. చూస్తున్న ప్రేక్ష‌కులు క‌నెక్ట్ అయ్యేలా ఎమోష‌న‌ల్ సీన్స్ రాసుకోవ‌డం ప్లస్ పాయింట్ అని చెప్ప‌చ్చు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే సినిమాల‌కు ఎమోష‌న‌ల్ డ్రామా ఎంత ఉంటే అంత మంచింది. దీనిని క‌రెక్ట్ గా సెట్ చేశారు ద‌ర్శ‌కుడు క‌బీర్ ఖాన్. అదే విధంగా 1983 వరల్డ్ కప్‌ ను గెలవడం క్లైమాక్స్ సన్నివేశంగా పెట్టడంతో సినిమా అదిరిపోయే టైమింగ్‌తో ముగిసి మంచి ఫీల్ ఇచ్చింది.

అయితే.. అక్క‌డ‌క్క‌డా స్లోగా సాగ‌డం.. ర‌న్ టైమ్ ఎక్కువ ఉండ‌డం సినిమాకి మైన‌స్ అని చెప్ప‌చ్చు. ఎడిటింగ్ బాగుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స‌న్నివేశాల‌ను ఎలివేట్ చేయ‌డం బాగా స‌పోర్ట్ చేసింది. సినిమా స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచి 83 కాలానికి తీసుకెళ్లింది. 83 గురించి ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.. స్పోర్ట్స్ ల‌వ‌ర్స్ మాత్ర‌మే కాకుండా.. సినిమా ల‌వ‌ర్స్ అంద‌రూ చూడ‌ద‌గ్గ చిత్రం.

రేటింగ్ 2.5/5

Related Posts