స‌రికొత్త రికార్డులు దిశ‌గా దూసుకెళుతున్న‌ ప్ర‌భాస్ “రాధే శ్యామ్” ట్రైల‌ర్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన భారీ పిరియాడిక్ మూవీ రాధేశ్యామ్. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌భాస్ స‌ర‌స‌న క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే న‌టించింది. ఈ పాన్ ఇండియా మూవీని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రామోజీ ఫిలింసిటీలో చాలా గ్రాండ్ గా నిర్వ‌హించారు. ఈ వేడుక‌లో ప్ర‌భాస్ ఫ్యాన్స్ రాధేశ్యామ్ ట్రైల‌ర్ ను రిలీజ్ చేశారు.

ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే… అమ్మ పెళ్లి గురించి అడిగితే చెప్పు.. నా చేతిలో ప్రేమ పెళ్లి లేవు అని చెప్పడంలో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ప్రేమ పెళ్లి అనే వాటికి తావు లేకుండా కనిపించిన అమ్మాయిని ఫ్లర్ట్ చేసే యువకుడిగా ప్రభాస్ కనిపించాడు. ఈ క్రమంలో అతని జీవితంలోకి ప్రేర‌ణ ప్ర‌వేశిస్తుంది. నేను ప్రేమలో పడను.. అలాంటి ప్రేమ నా వల్ల కాదు.. అంటూ ఆమెను ముద్దుల వరకూ తీసుకొచ్చాడు. అదే సమయంలో ప్రపంచ దేశ నాయకులందరూ కలవాలనుకునే గొప్ప హస్తసాముద్రిక నిపుణుడు విక్రమాదిత్యగా ప్రభాస్ ను పరిచయం చేసారు.

విక్రమాదిత్య, ప్రేరణ ప్రేమకథలో జ్యోతిష్యం, సైన్స్ లు కీలక పాత్ర పోషించబోతున్నట్లు అర్థం అవుతోంది. వీరి జీవితాలకు ట్రైన్ మరియు షిప్ మునిగిపోవడం.. భూకంపం రావడం వంటి అంశాలను లింక్ చేసిన‌ట్టుగా ట్రైలర్ లో చూపించారు. దీనిని బ‌ట్టి వినూత్న ప్రేమ‌క‌థ‌ను తెర పై ఆవిష్క‌రించార‌నేది అర్ధం అవుతుంది. ఈ ట్రైల‌ర్ చూసిన వెంట‌నే అంద‌రికీ క‌నెక్ట్ అయ్యింది. రికార్డు వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకెళుతుంది. మ‌రి.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రాధేశ్యామ్ బాహుబ‌లి రికార్డ్ ను క్రాస్ చేస్తుందేమో చూడాలి.

Related Posts